లాభం లేదమ్మా... బోండాంలా కనిపిస్తున్నావ్
ఆర్థిక మాంద్యం రంగుల తెరనూ ఆక్రమించేసింది. మణిరత్నం "రావణ", శంకర్ "రోబో" సినిమా బడ్జెట్లు సదరు నిర్మాణ సంస్థల మెడలకు గుదిబండల్లా తయారయ్యాయని సమాచారం. మాంద్యం దెబ్బతో బెంబేలెత్తిన సదరు నిర్మాణ సంస్థలు వీలైనంత వరకూ ఖర్చుకు కోతలేయమని చెప్పేస్తున్నారట. అదేమని అడిగే ధైర్యమూ, తెగువ ఇక దర్శకులకు ఎక్కడుంటుందీ. అంతటా మాయదారి మాంద్యమయ్యే మరీ...
సినిమాల నిర్మాణ వ్యవహారం ఇలా ఉంటే.. నటీనటులు పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏమీ లేదట. 6 ప్యాక్‌తో సూపర్ బాడీ కనబరుస్తూ... ఎప్పటికప్పుడు హ్యాండ్‌సమ్ లుక్‌తో ఉండే కుర్ర హీరోకే "Bolly"... "Tolly"..".Kollyవుడ్" లు ఛాన్సులిస్తున్నాయట.
కనుకనే బాలీవుడ్‌లో షారుక్, అమీర్... కోలీవుడ్‌లో సూర్య, విక్రమ్ వంటివారు... మన టాలీవుడ్‌లో ప్రభాస్, రామ్ చరణ్, నితిన్ వంటి కుర్ర హీరోలు 6 ప్యాక్ బాట పట్టారట. వీటిని ఖాతరు చేయక పొరపాటున కాస్త నడుమో, పొట్టో పెంచుకున్నారంటే... అంతే. అదే సాకుతో రుసుమును తగ్గిస్తున్నారట. కొండొకచో... వీరికి సినిమా ఛాన్సు సైతం మృగ్యం.
ఇక హీరోయిన్ల పరిస్థితి మరీ అధ్వానంగా ఉందట. ఒకప్పుడు బొద్దు భామలకు మంచి గిరాకీ ఉంటే... ఆ తర్వాత అది బక్క పలచని భామల పరమైంది. మరి నేడో... "0" సైజుకే మా ఓటు అంటున్నారట దర్శక నిర్మాతలు. పాపం సున్నా సైజుకోసం తారామణులు రేయింబవళ్లు నిద్రాహారాలు మానేస్తున్నారట.
కొందరు తారలైతే జీరో సైజుకొచ్చి షూటింగుల్లో కళ్లు తిరిగి పడిపోయిన సంఘటనలు సైతం చోటుచేసుకున్నాయి. ఇక ఈ సైజును మెయింటైన్ చేస్తూ నిర్మాతకు అందుబాటు రేటులో ఉంటే... సదరు హీరోయినే ఇప్పుడు టాప్ ఒన్ అట.
ఈ వరుసలో ఇప్పుడు తమన్నా... ఇలియానా... అనుష్క... తదితరులు ఉన్నట్లు కనబడటం లేదూ...