1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు

అమ్మో ఆయనంటే చాలా భయం..!

వినోదం వెండితెర గుసగుసలు భయం హంసానందిని అధినేత కాస్మోటిక్ మోడల్ శ్రద్ధాదాస్ జగపతిబాబు
బాబోయ్ ఆయనంటే చాలా భయమేసేది.. ఇప్పటికీ తలచుకుంటేనే ఒళ్ళు జలదరిస్తోందని నటి హంసానందిని చెబుతోంది. ముంబైలో కాస్మోటిక్ మోడల్‌గా ఉన్న శ్రద్ధాదాస్ "అధినేత" చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇదే చిత్రంలో జగపతిబాబుకు సెక్యూరిటీ పాత్రను హంసానందిని పోషిస్తోంది.

ఇందులో తన పాత్ర గురించి హంసానందిని చెబుతూ.. మొదట్లో ఆయన (జగపతిబాబు) వాయిస్ వింటుంటే భయమేసిందని చెప్పింది. ఎమోషనల్ డైలాగ్స్ చెబుతుంటే సింహం గర్జించినట్లుందని, అందుకే ఆయనకు సింహం అని పేరు పెట్టానని పకపకా నవ్వేసింది. కానీ కొద్దిరోజులు గడిచాక ఆయన మనస్తత్వం అర్థం చేసుకున్నానని, జగపతిబాబు చాలా మంచి వ్యక్తి అని హంసానందిని కితాబిచ్చింది.