1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు

"పెప్సీ" అంబాసిడర్‌గా రామచరణ్ తేజ.!

వినోదం వెండితెర గుసగుసలు పెప్సీ అంబాసిడర్ రామచరణ్ చిరంజీవి థమ్స్అప్ మహేష్ బాబు పెప్సీ పవన్ 7 అప్ అల్లు అర్జున్
మెగాస్టార్ చిరంజీవి "థమ్స్‌అప్' యాడ్ కోసం అంబాసిడర్‌గా పనిచేశారు. ఆ తర్వాత ఆ యాడ్ టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుకు దక్కింది. మరో కూల్‌డ్రింక్ పెప్సీకి పవన్ కళ్యాణ్ అంబాసిడర్‌గా ఉన్నారు. అదేవిధంగా అల్లు అర్జున్ "7 అప్"కు పనిచేస్తున్నారు. తాజాగా ఇదే ఫ్యామిలీ హీరో రామ్‌చరణ్‌కు 'పెప్సీ' అంబాసిడర్‌ అవకాశమొచ్చింది.

ఇటీవలే ముంబైలో యాడ్ షూట్ చేసినట్లు సమాచారం. ఆ యాడ్‌లో దీపికా పదుకునే కూడా నటించిందని తెలిసింది. పెప్సీ కంపెనీ ఇండియా మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సందీప్ సింగ్ అరోరా దీన్ని ధృవీకరించారు. యంగ్‌స్టర్ చరణ్ తమ కంపెనీకి అంబాసిడర్‌గా ఉండడం ద్వారా లాభాల పంట పండుతోందని ఆశిస్తున్నారు.