ఒక పక్క వేసవి ఎండలతో శరీరాలు వేడెక్కుతుంటే మరోపక్క ప్రియమణి, అనుష్క వంటి సెక్సీ తారలు బికినీలతో కుర్రాళ్ల మెదళ్లను హీటెక్కిస్తున్నారు. బాలకృష్ణ సరసన "ద్రోణ"లో నటిస్తున్న ప్రియమణి ఎటువంటి అభ్యంతరాలు పోకుండా యధేచ్చగా అందాలు ఆరబోసినట్లు భోగట్టా.
కానీ బికినీలో ప్రియమణికంటే అనుష్క సూపర్‌గా ఉంటుందని ఎవరో చెప్పారట. అంతే... అనుష్క సైతం భిల్లా చిత్రంలో బికినీ వేసుకుని నటించడానికి సిద్ధమైపోయిందట. ఇప్పటికే ప్రియమణి బికినీ వేసుకున్న ఫోజులు టాలీవుడ్ కుర్రకారు గుండెల్లో గుబులు రేపుతున్నాయి. ఈ ఫోజులను మించిన ఫోజులను అనుష్క ఇవ్వబోతున్నట్లు టాలీవుడ్ సినీజనం గుసగుసలు పోతున్నారు.
ఇదిలా ఉంటే 'అరుంధతి'లో సంప్రదాయబద్ధంగా నటించిన సెక్సీ యోగా టీచర్ అనుష్క... బికినీలో నటిస్తుందా... అని కొందరు దీర్ఘాలు తీస్తున్నారు. అయితే 'భిల్లా' చిత్ర యూనిట్ మాత్రం బికినీలో అనుష్క మాట నిజమేనంటున్నారట. ఇదే గనుక నిజమైతే టాలీవుడ్‌లో మండే ఎండలకు మించిన హాటు రేగిపోతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ వేసవి అంతా బికినీ సందడే ఉంటుందేమో.