మల్లికాషెరావత్ అంటేనే సెక్సీభామ, వివాదాల నటి అని బాలీవుడ్ వర్గాల్లో టాక్. ఆ మధ్య "దశావతారం" చిత్రంలో పద్మభూషణ్ కమల్ హాసన్ సరసన ఓ మెరుపు మెరిసిన అందాల ముద్దుగుమ్మ మల్లికకు ఈ మధ్య భలే ఛాన్స్‌లు వస్తున్నాయని తెలిసింది.
"దశావతారం" సినిమా తర్వాత మళ్ళీ సౌత్ చిత్రాల్లో నటించని మల్లిక, ప్రస్తుతం పాకిస్తానీ చిత్రంలో నటించనున్నట్లు సమాచారం. షెరావత్ అందాలను పాకిస్తానీ ప్రజలు కూడా భలే ఆస్వాదిస్తారట. కానీ అక్కడ కొన్ని సెన్సార్ నిబంధనలున్నాయని, ఇక్కడలా ఏకంగా అందాలను ఆరబోస్తే మాత్రం కుదరదట.
పాకిస్తాన్‌లో షెరావత్ నటించడానికి అసలు కారణమేమని ఆరాతీస్తే.. కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాకు మల్లికా అంటే చచ్చేంత ప్రేమట. అనేకసార్లు ఒమర్ ఆమె నటించిన చిత్రాలను చూశాడని, పైగా అతడి ప్రమాణ స్వీకారానికి కూడా షెరావత్ హాజరైందని వార్తలు గుప్పుమన్నాయి.
అంతేకాదు.. మల్లికకు ఒమర్ విలువైన ఆభరణాలు, దుస్తులు గుర్తుగా ఇచ్చాడట. ఇంకా సినిమాల్లో అవకాశాలు కూడా ఇప్పిస్తున్నాడట. మరి.. మల్లికపై ఒమర్ ప్రేమ ఎంతవరకు సాగుతుందో..? లేదా తనే ఆమెను సొంతం చేసుకుంటాడో..? వేచి చూడాల్సిందే..!