గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » గుసగుసలు » రాజస్థాన్ రాయల్స్‌తో శిల్పాశెట్టి హోలీ!
గుసగుసలు
Feedback Print Bookmark and Share
 
PTI
బాలీవుడ్ అగ్రనటి, అందాలముద్దుగుమ్మ శిల్పాశెట్టి తన ఐపీఎల్ ఫ్రాంచైజీ జట్టు రాజస్థాన్ రాయల్స్‌తో హోలీ పండుగ జరుపుకోనుందట. ముంబైలోని గ్రాండ్ హియట్ స్టార్ హోటళ్లో ఈ నెల పదోతేదీన ఆనందోత్సాహాలతో హోలీని జరుపుకోనున్నట్లు తెలిసింది.

టీం కెప్టెన్ షేన్ వార్న్‌తో పాటు రాజస్థాన్ రాయల్స్ జట్టు సభ్యులంతా ఈ హోలీ పార్టీలో పాల్గొంటారని ముంబై సినీ వర్గాలు వెల్లడించాయి. ఈ హోలీ పండుగను తన ఫ్రాంచైజీ జట్టు సభ్యులంతా అదుర్స్ అనేలా జరపాలని శిల్పాశెట్టి భావిస్తుందట.

అంతేగాదు.. అంతర్జాతీయ క్రికెట్ సభ్యులైన తన జట్టు ఆటగాళ్లను భారత సంప్రదాయ పండుగైన హోలీతో శిల్పాశెట్టి మెప్పించే దిశగా సర్వం సిద్ధం చేసిందని తెలిసింది. ఇందు కోసం.. హోలీ జరిగే హోటల్ పార్టీ హాలును విలువైన స్క్రీన్స్, సూట్‌లతో అద్భుతంగా డిజైన్ అలంకరించనున్నట్లు సమాచారం.

ఇంతేగాకుండా.. హోలీని పురస్కరించుకుని శిల్పాశెట్టి.. జట్టు సభ్యులందరికీ తీపి పదార్థాలతో బిగ్ పార్టీ ఇస్తోందట. దీనికోసం జిలేబీ, గులాబ్ జామూన్, లడ్డూలు వంటి తదితర స్వీట్లను శిల్పా ఆర్డర్ చేసిందట. ఇంకేముంది..! శిల్పాశెట్టి తన జట్టు సభ్యులతో హ్యాపీగా హోలీ పండుగను జరుపుకోవాలని ఆశిద్దామా..!
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: వినోదం వెండితెర గుసగుసలు స్వీట్లు షేన్వార్న్ స్టార్ హోటల్ హోలీ పండుగ రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ జట్టు