గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » గుసగుసలు » అవాంఛిత రోమాలు తొలగిస్తే.. అంతా నిగనిగే: సమీరా
గుసగుసలు
Feedback Print Bookmark and Share
 
FILE
బాలీవుడ్ భామలు వట్టి వాగుడు కాయలని ఆ మధ్య ఓ తెలుగు హీరో కామెంట్ చేశాడు. సదరు హీరోను అంతగా బాధపెట్టిన వసపిట్ట ఎవరో తెలీదుగానీ... సెక్సిణి సమీరా మాత్రం అచ్చంగా అదే కోవలోకి వస్తుందంటున్నారు తోటి హీరోయిన్లు.

అందాలకు మెరుగులు దిద్దేందుకు ఏం చేస్తావూ...? అని ఒక రోజు పొరపాటును సమీరను కదిలించారట. అంతే... ఇక వసపిట్టలా తనకు తెలిసినవన్నీ ఇలా ఏకరువు పెట్టిందట.

అందంగా ఉండటానికి తాను హాయిగా, తీరిగ్గా( ఓ గంటసేపు) షవర్ స్నానం చేస్తుందట. ఈ స్నానం తన నరాలను ఉత్తేజపరిచి మేని మెరుపులీనేలా చేస్తుందట. షవర్ స్నానం చేసేటపుడు సువాసనలు వెదజల్లే షవర్ జెల్ ఉపయోగించడం మాత్రం మరిచిపోకండని సలహాలిచ్చిందట.

ఇక వ్యక్తిగత శుభ్రత విషయానికి వస్తే... చేతులు, కాళ్లు, అప్పర్ లిప్, కనుబొమలు నున్నగా మెరవడానికిగాను అవాంఛిత రోమాలను తొలగించుకోవాల్సిన అవసరాన్ని మరీ గుచ్చి గుచ్చి చెప్పిందట.

మేకప్ అతిగా కాక సహజసిద్ధంగా ఉండేట్లు కళ్లు, అధరాలను మత్తు రేకిత్తించేట్లు తీర్చి దిద్దుకోవాలని అందిట. ఇంకా అక్కడే ఉంటే.. ఏమేమి చెపుతోందోనని తన తోటి నటీమణులు మెల్లగా జారుకున్నారట. అయ్యబాబోయ్... సమీరాను మరోసారి దేని గురించైనా అడగొచ్చు కానీ, అందం గురించి అడక్కూడదని వెళ్లేటపుడు గొణుక్కుంటూ వెళ్లారట.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: సమీరా రెడ్డి అందాలకు చిట్కాలు బాలీవుడ్ టాలీవుడ్ మేకప్ అందమైన పెదవులు