శివపుత్రుడు", "శేషు" వంటి హిట్ చిత్రాల దర్శకుడు బాల, తాజాగా ఆర్య హీరోగా "నేను దేవుడ్ని" అనే చిత్రాన్ని రూపొందించారు. ఈ డబ్బింగ్ సినిమా ద్వారా తెలుగువారికి పరిచయమైన అందాల నటి పూజ. శ్రీలంకలో పుట్టి పెరిగిన ఈ భామ బెంగళూరులో ఎం.బి.ఎ చేసింది.
తాజాగా నాలుగు చిత్రాల్లో కలిసి నటించిన ఆర్య-పూజలు ఈ మధ్య ప్రేమలో పడ్డారని సినిమా వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. ఈ విషయంపై పూజ స్పందిస్తూ.. నాలుగు సినిమాలు ఓ హీరోతో కలిసి నటించినంత మాత్రాన ప్రేమపుడుతుందా..? అని ప్రశ్నించింది.
ఇంతవరకు ఎవరి ప్రేమలో పడలేదని పూజ ఘంటాపదంగా చెబుతోంది. సరే మీరు ఎలాంటివాడిని ప్రేమిస్తారని అడిగితే..? "తనను ప్రేమించే వాడు దైవభక్తి కలిగి ఉండాలి. నన్ను నాకంటే బాగా చూసుకోవాలి. భూతదయ ఉండాలి. చిన్నపిల్లల్ని ప్రేమించే మనసు కావాలని.." కొన్ని రూల్స్ పెట్టిందట..!. మరి ఆ రూల్స్.. ఆర్యకు లేవేమో..!. ఇంకెవరికైనా ఆ లక్షణాలున్నాయేమో..!