1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. "ముద్దు" సీన్ ప్రచారం: సుస్మితా "గుర్రు"

"ముద్దు" సీన్ ప్రచారం: సుస్మితా "గుర్రు"

సుస్మితాసేన్ ముద్దు సీను కొత్త చిత్రం మాజీ ప్రియుడు రణ్బీర్ చిత్ర ప్రచారం నిర్మాత దర్శకుడు బాలీవుడ్ చిత్రపరిశ్రమ
తాజాగా నటించిన 'కర్మా ఔర్ హోలీ' చిత్రంలో మాజీ ప్రియుడు రణ్‌దీప్‌ హుడాతో తాను చేసిన ముద్దు సీన్‌ను నిర్మాతలు ప్రచారం చేసుకోవడం పట్ల సుస్మితా సేన్ ఆగ్రహంతో ఊగిపోతోంది. దీనిపై ఆమె మీడియాతో మాట్లాడుతూ 'కర్మా ఔర్ హోలీ' చిత్ర నిర్మాతలు ప్రచారం కోసం ఇలా చీప్ జిమ్మిక్స్‌కు పాల్పడటం ఏమంత బాగోలేదు.

సినిమా ప్రచారం అనేది హూందాగా ఉండాలి. చిత్ర సన్నివేశంలో భాగంగా తాను చేసిన ఆ ముద్దు సీనును పబ్లిసిటీ కోసం నిర్మాతలు ప్రధానాస్త్రంగా చేసుకోవడం బాధాకరంగా ఉంది. ఇప్పటికైనా నిర్మాతలు మేల్కొని పబ్లిసిటీలో ఆ ముద్దు సీన్‌ను తొలగించాలని అని ఆగ్రహంతో కోరింది.

అయితే, సేన్ మాజీ ప్రియుడు మాత్రం ప్రియురాలి డిమాండ్‌పై నో కామెంట్ అంటున్నారు. సుస్మిత ముద్దు సీన్‌పై నాకేం తెలియదు. ఈ వివాదం దర్శక నిర్మాతలకు, సుస్మితకు సంబంధించినది. దీనిపై నేను కామెంట్ చేయడం బాగుండదు అంటూ వివాదం నుంచి తప్పించుకున్నాడు. ఎంతైనా.. మాజీ ప్రియురాలు కావడం వల్లే కదా రణ్‌బీర్ ఇలా వ్యవహరిస్తున్నాడంటూ బాలీవుడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నారు.
About Writer
PNR