1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు

కోట్లు పెట్టినా హీరోల ముందు నిర్మాతలు జీరోలే..!

వినోదం వెండితెర గుసగుసలు కోట్లు నిర్మాతలు జీరోలు రాజా సంజన సమర్థుడు ఆడియో రిలీజ్
కోట్లు ఉన్నా నిర్మాతలు హీరోల ముందు జీరోలని పలు ఉదంతాలు తెలియజేస్తున్నాయి. తాజాగా హీరో రాజాది కూడా అలాంటిదే..! ఈ మధ్య హీరో రాజా వార్తల్లోకి ఎక్కుతున్నాడు. ఒకటి, రెండు చిత్రాలు హిట్టయ్యేసరికి రూల్స్ పెడుతున్నాడని ఇండస్ట్రీ వర్గాలు వాపోతున్నాయి. రాయలసీమకు చెందిన ముగ్గురు నిర్మాతలు "సమర్థుడు" అనే చిత్రాన్ని తీశారు. సినీ ఇండస్ట్రీకి నిర్మాతలు కొత్తకావడంతో రాజా గొంతెమ్మ కోర్కెలను నెరవేర్చి, చేసేది లేక టైమ్ కోసం ఎదురుచూస్తున్నారట..!

ఇలా.. ఒకసారి షూటింగ్ డ్రెస్ నచ్చలేదని రాజా చెప్పడంతో... అప్పటికప్పుడు దుబాయ్ నుంచి రాజా చెప్పిన డ్రస్సును నిర్మాత తెప్పించాడట. అంతేకాదు.. ఆ డ్రెస్ వచ్చేదాకా షూటింగ్ కాన్సిల్ చేశాడట. ఇలాంటి చర్యల వల్ల లక్షలుపెట్టిన నిర్మాతలు దిగులు పెట్టుకుంటున్నారట. ఫ్యాక్షనిజం ప్రాంతం నుంచి వచ్చిన నిర్మాతలు కూడా ఇలాంటి హీరోల ముందు జీరోలేనని, ఏమీ చెయ్యలేక అన్నింటికీ తలాడిస్తున్నారని సినీ వర్గాలు అంటున్నాయి.

ఇంకా చెప్పాలంటే.. సమర్థుడు చిత్రం కోసం యూనిట్ బుక్ చేసిన హీరోయిన్‌ను కాదని, ఆవిడకు ఫోటోసెషన్స్ పూర్తయ్యాక కూడా సంజన అనే అమ్మాయి కావాలని పట్టుబట్టి ఎక్కువ పారితోషికంతో "సమర్థుడు"లో చేయించాడట.!.

ఇదంతా ఒక భాగమైతే ఆడియో విడుదల ముందు రోజు, నిర్మాతలు కలిసి రాజాని రమ్మని పిలిస్తే కొండెక్కి కూర్చున్నాడట. దాంతో నిర్మాతలు చాలా ఓపిగ్గా, రాజాకు నచ్చజెప్పి ఆడియోరిలీజ్‌కు రప్పించారని సమాచారం. అందరూ హాజరైన ఆడియో రిలీజ్ కార్యక్రమంలో రాజా మాత్రం చివర్లో హాజరు కావడం విశేషం.

దీంతో నిర్మాతలు టెన్షన్ వీడి.. "కోట్లు ఖర్చుపెట్టిన మనం.. ఇలాంటి వాడితో టెన్షన్ పడుతున్నాం..". "సినిమా రిలీజ్ కానీ వాడి సంగతి చెబుదామని.." తమ సన్నిహితులతో చెప్పుకున్నారట.!