కాంగ్రెస్ మెప్పుకోసమే మేస్త్రీ తీశారా...?
దర్శకరత్న దాసరి నారాయణ రావు నిర్మించిన "మేస్త్రి" చిత్రంలో ప్రరాపా అధినేత చిరంజీవిని ఏకేశారని విశ్వసనీయ సమాచారం. కాంగ్రెస్ పార్టీ మెప్పుకోసమే మేస్త్రీ సినిమా తీశారని... ఫిలిమ్ నగర్ వర్గాల్లో వార్తలు గుప్పుమన్నాయి. ఇంకా రిలీజ్ కాని ఈ సినిమాకు సురేష్ కృష్ణ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో కార్మికుల నాయకుడిగా దాసరి నటిస్తే.. నిమ్నజాతికి చెందిన మేజర్‌గా మోహన్ బాబు నటించారు. రియల్ స్టార్ శ్రీహరి పోలీసు అధికారిగా నటించాడు.
ఇందులో.. మోహన్‌బాబు, శ్రీహరి పాత్రలతో చిరంజీవి చేస్తున్న పలు కార్యక్రమాల్ని విమర్శించడమేగాకుండా.. షియాజీ షిండే పాత్రను అల్లుఅరవింద్‌ను దృష్టిలో పెట్టుకుని తీశాడని తెలిసింది. అదేవిధంగా చిరంజీవి పక్కవారిని ఎదగనిచ్చే నైజంలేని వ్యక్తిగా "మేస్త్రి" చిత్రీకరించినట్లు విశ్వసనీయ సమాచారం.
ఈ చిత్రం ఈ నెల 12 (గురువారం) విడుదల కానుంది. ఈ చిత్రాన్ని ఇప్పటికే పలువురు డిస్ట్రిబ్యూటర్లు చూశారు. అనంతరం వారు ఒకరితో ఒకరు చర్చించుకుంటూ.. కాంగ్రెస్ పార్టీ ద్వారా కోట్లు సంపాదించుకున్న దాసరికి పదవి లేకుండా పోయింది. మళ్ళీ ఆయన ఏదో ఆశించి కాంగ్రెస్ మెప్పుకోసమే ఈ చిత్రం తీశాడని వారు చెప్పుకోవడం కొసమెరుపు.