1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు

అక్షయ్ కుమార్ అంటే "కైలీ"కి భలే ఇష్టమట..!

వినోదం వెండితెర గుసగుసలు బాలీవుడ్ అక్షయ్ కుమార్ ఆస్ట్రేలియా పాప్ స్టార్ కైలీ మినోగ్ బ్లూ
బాలీవుడ్ యంగ్ స్టార్ అక్షయ్ కుమార్ అంటేనే... ఆస్ట్రేలియా పాప్ స్టార్ కైలీ మినోగ్ భలే ఇష్టమట..!. బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన అందాల ముద్దుగుమ్మ కైలీ మినోగ్ అక్షయ్ కుమార్ హీరోగా నటించే "బ్లూ" సినిమాలో కీలక పాత్ర పోషిస్తుందన్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ఈ పాప్ గాయని ఓ పాట పాడుతూ.. తనే చిందులేయనుందని బాలీవుడ్ వర్గాలు వెల్లడించాయి.

ఈ నేపథ్యంలో.. బాలీవుడ్‌లో అడుగెట్టిన కొద్ది రోజులకే కైలీ మినోగ్.. అక్షయ్ అంటే పడిచస్తుందట. అక్షయ్ సినిమాలను చాలాసార్లు థియేటర్లలో చూస్తోందట. మొత్తానికి అక్షయ్‌కు కైలీ బిగ్ ఫ్యాన్ అయిందని సినీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.

ఇటీవల విడుదలైన అక్షయ్ కుమార్ "ఛాందిని చౌక్ టు చైనా" చిత్రాన్ని ఎన్నో సార్లు చూసిన కైలీ, అతడు హీరోగా చేస్తున్న "బ్లూ" సినిమాలో ఆయనతో కలిసి నటించడం అదృష్టంగా భావిస్తుందని బాలీవుడ్ వర్గాల్లో టాక్.

ఈ విషయమై బ్లూ సినిమా దర్శకుడు డిసౌజా మాట్లాడుతూ.. కైలీ బాలీవుడ్‌లో అడుగుపెట్టడం అదృష్టమని, ఇంకా ఆమె అక్షయ్ కుమార్ అభిమానురాలని చెప్పారు. చాందిని చౌక్ టు చైనా చిత్రాన్ని కైలీ లండన్‌లో అనేకసార్లు చూసిందని డిసౌజా అన్నారు.

"బ్లూ" సినిమా కోసం కైలీ బాగా హోం వర్క్ చేస్తుందని, తన నటనను అద్భుతంగా ప్రదర్శిస్తోందని డిసౌజా తెలిపారు. అంతేగాకుండా.. కైలీ "ఇంటలిజెంట్, ఫెంటాస్టిక్ పెర్‌ఫార్మర్" అని ఆయన కొనియాడారు.

ఇకపోతే.. పాప్ గాయని అయిన కైలీ మినోగ్ "బ్లూ" చిత్రంలో ఆమె ఓ పాట కోసం చీరకట్టులో కన్పించనుందని, ఆమెకు హిందీ రాకపోయినా డైలాగ్‌లను స్పష్టంగా పలుకుతోందని డిసౌజా వెల్లడించారు.