త్రిష కాంగ్రెస్ తరపున పర్యటిస్తుందట...?!!
బక్కపలచని భామ త్రిష కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేయనుందనే వార్తలు టాలీవుడ్ సినీ పరిశ్రమలో గుప్పుమన్నాయి. దీనిపై త్రిష స్పందించేలోపే రాష్ట్రంలోని పలు ప్రధాన నగరాలకు ఈ వార్తను సెల్ ఫోన్లు మోసేశాయి.
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు త్రిష పర్యటనపై చర్చించుకోవడం మొదలుపెట్టారట. ఇటీవల చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన తర్వాత తెలుగు సినీ పరిశ్రమలోని పలు సీనియర్, జూనియర్ నటీనటులు ఆయా పార్టీలకు క్యూ కట్టడం కనిపిస్తోంది.
వచ్చిన తారలను వచ్చినట్లు కాదనకుండా కాంగ్రెస్, తెలుగు దేశం పార్టీలు చేర్చేసుకుంటున్నాయి. దీంతో రాష్ట్ర రాజకీయ రంగానికి పాక్షికంగా సినిమా రంగు అంటుకుంది. రాజకీయ రంగాన్నే నమ్ముకుని బతుకుతున్న కొందరు నేతలు సినీ తారల ప్రవేశంతో ఖిన్నులై, దిక్కుతోచని స్థితిలో పడ్డారని వార్త.
అన్నట్లు త్రిష సంగతి చెప్పలేదు కదూ... కాంగ్రెస్ పార్టీ తరపున తాను పర్యటించబోతున్నానని సినీ మిత్రులు ఒకరు చెపితే త్రిషకు తెలిసిందట. ఈ విషయాన్ని తెలుసుకుని త్రిష ఆశ్చర్యానికి లోనైందట. అసలు రాజకీయాలలో ప్రవేశించే వయసు తనది కాదని చెప్పిందట. అంటే... ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో పొలిటిక్స్‌లో ప్రవేశించాలనే కోరిక ఉన్నట్లు తెలియడం లేదూ...