1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు

అమృత అరోరా హనిమూన్ క్యాన్సిల్..!

వినోదం వెండితెర గుసగుసలు అమృత అరోరా హనిమూన్ ట్రిప్ క్యాన్సిల్ వివాహం జ్వరం రిసెప్షన్
బాలీవుడ్ గ్లామరస్ స్టార్ అమృత అరోరా హనిమూన్ క్యాన్సిల్ అయిందట..!. ఇటీవలే షకీల్ లాడెక్‌ను వివాహమాడిన అమృత అరోరాకు జ్వరమొచ్చిందట. అందుకే ఆమె హనిమూన్ రద్దైందని అరోరా సన్నిహితుల సమాచారం.

పెళ్లి సమయంలో అతిథులను గౌరవించడం, కొత్త పెళ్లి కూతురుగా తన అందం చెదిరిపోకుండా చూసుకోవడం, స్నేహితులతో హ్యాపీగా గడపడంతో అమృతా అరోరాకు నీరసం వచ్చేసిందట. ఈ దెబ్బతో ఆమెకు జ్వరం కూడా తగిలిందట.

ఇంకేముంది..? పాపం కొత్తగా పెళ్లయిన అమృత శరీరం అలసిపోయి, జ్వరంతో పడకకెక్కినట్లు సమాచారం. దీంతో ఆమె హనిమూన్ ట్రిప్ కూడా క్యాన్సిల్ అయిందని తెలిసింది. ఈ పరిస్థితిలో షకీల్, అరోరాను కళ్లల్లో పెట్టి చూసుకుంటున్నాడట. అరోరాకు సపరి చర్యలన్ని షకీలే చేస్తున్నాడని తెలిసింది.

ఇదిలా ఉండగా.. అరోరా-షకీల్ వెడ్డింగ్ రిసెప్షన్ ఇటీవలే వైభవంగా జరిగింది. ఈ నేపథ్యంలో.. జ్వరంలో పడిన అమృత త్వరలో కోలుకుంటే ఈ కొత్త జంట మెక్సికోకు ప్రయాణమవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇంకేముంది..? అమృత త్వరలో కోలుకుని హ్యాపీగా హనిమూన్‌ ట్రిప్‌కు వెళ్లాలని మనమూ ఆశిద్దాం..!
About Writer
SELVI.M