నా అభిమాని నాతో నటించమంటున్నాడు: కత్రినా
కత్రినాకైఫ్‌కు బాలీవుడ్‌లోనే కాదు దేశవ్యాప్తంగా వీరాభిమానులున్నారు. బీహార్‌లోని పాట్నాకు చెందిన ఓ వీరాభిమాని కత్రినాకైఫ్‌కు పొద్దస్తమానం ఫోనులు ఎస్ఎమ్ఎస్‌లు పంపిస్తున్నాడట. తనను పెళ్లి చేసుకోమనో, లేదంటే ప్రేమిస్తున్నాననో అతను ఫోను చేయడం లేదట.
తానొక స్క్రిప్టు తయారు చేశాననీ, కొరియర్ చేశాననీ, స్క్రిప్టు చూసి తనతో నటించమని కత్రినాకైఫ్‌ను బతిమాలుతున్నాడట. స్క్రిప్టు ప్రకారం అందులో హీరోయిన్ పాత్ర కత్రినాకైఫే పోషించాలట.
ఇంతటి పాపులర్ హీరోయిన్ వెంబట, పనికిమాలిన వెధవ, జులాయి కుర్రాడు నటించాలని, దానికి తాను కరెక్టుగా సరిపోతానని ఫోనులో కత్రినాకు పదే పదే చెపుతున్నాడట. మనిద్దరం కలిసి నటిస్తే ఆ చిత్రానికి అవార్డు ఖాయమని అంటున్నాడట.
కత్రినా మాత్రం అతను ఫోను చేసినప్పుడల్లా చూద్దాం.. చేద్దాం అంటోందట. అభిమానులంటే కత్రినకు ఎంత ప్రేమో కదా...