తల్లిదండ్రులు కాబోతున్న అభి-ఐష్..!?
బాలీవుడ్ చిలకాగోరింకలు అభిషేక్ బచ్చన్-ఐశ్వర్యారాయ్ దంపతులు త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారని బాలీవుడ్ వర్గాల సమాచారం. అభి-ఐష్‌లకు పిల్లలంటే చాలా ఇష్టమట.
ఇటీవల ఐశ్వర్యారాయ్ వెయిట్‌ను పరీక్షిస్తే ఆమె గర్భంతో ఉన్నట్లు తెలిసిందని బాలీవుడ్ వర్గాల ద్వారా తెలిసింది. అయితే ఈ విషయమై "ఐష్ దంపతులు" ఇంకా నోరువిప్పలేదు.
అయితే తల్లిదండ్రులు అనే అనుభూతి త్వరలో మా జంటకు కలుగుతుందని ఐశ్వర్యారాయ్ ఇటీవల తెలిపినట్లు వార్తలొచ్చాయి. సంతానమనేది దేవిడిచ్చే వరమని, అభిషేక్ కూడా మాతృత్వం గురించి, పిల్లల గురించి తనతో తరచూ మాట్లాడుతుంటారని ఐష్ వెల్లడించింది.
ఇదిలా ఉండగా.. పెళ్లయితేనే హీరోయిన్లకు అవకాశాలు దక్కడం కష్టమైన ప్రస్తుత పరిస్థితుల్లో, ఐశ్వర్యారాయ్ మాత్రం పెళ్లయిన తర్వాత కూడా తన హవాను కొనసాగిస్తూనే ఉంది. వివాహం చేసుకున్న తర్వాత కూడా ఆమెకు ఆఫర్లు వెల్లువల్లా వచ్చాయి.
ఇందులో భాగంగానే, జోధా అక్బర్‌లో అత్యద్భుత నటనను ప్రదర్శించింది. తన అందచందాలను చెక్కుచెదరనీయకుండా తెరపై ప్రేక్షకులను ఇట్టే ఆకర్షించిన ఐశ్వర్యారాయ్, హాలీవుడ్ ఫిల్మ్ పింక్ పాంథర్ 2 కోసం ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు కూడా హాజరైంది.
దీంతో పాటు భారతీయ నటీమణిగా ఫోర్బ్ పత్రిక ముఖపుటలో కన్పించింది. పెళ్లయ్యాకే ఐష్ సినీ కెరీర్ మలుపు తిరిగిందని బాలీవుడ్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్న నేపథ్యంలో, ఆమె తల్లి కాబోయే అనుభూతి చాలా గొప్పదని ఐష్ అంటోంది. ఇంకేముంది..? త్వరలో అమితాబ్ బచ్చన్ తాత కాబోతున్నారన్నమాట...!.