శ్వేతబసు ప్రసాద్ భలే హ్యాపీగా ఉందట..!
"కొత్తబంగారు లోకం" చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన అందాల ముద్దుగుమ్మ ఈ మధ్య భలే హ్యాపీగా ఉందట. ఇందుకు కారణం ఆమె చేతి నిండా సినిమా ఆఫర్లు ఉండటమేనని సినీ వర్గాలు కోడైకూస్తున్నాయి.
కొత్తబంగారు లోకంలో ఆమె ప్రదర్శించిన అద్భుత నటనకు ఛాన్స్‌ల మీద ఛాన్స్‌లు వచ్చేస్తున్నాయని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్. స్వీట్ అండ్ సెక్సీ భామగా టాలీవుడ్‌లో ముద్రవేసుకున్న శ్వేత.. తాజాగా మూడు సినిమాల్లో నటిస్తోంది.
బెల్లంకొండ నిర్మాణ సారథ్యం వహించే "రైడ్" అనే మల్టీ స్టారర్ చిత్రంలో శ్వేత బసు అష్టాచమ్మా ఫేమ్ నాని సరసన హీరోయిన్‌గా నటిస్తోంది.
ఇకపోతే.. ప్రముఖ దర్శకుడు జి. నాగేశ్వర రెడ్డి నేతృత్వంలో, వైభవ్ హీరోగా నటిస్తోన్న కొత్త చిత్రంలోనూ శ్వేత బసు వైవిధ్యమైన పాత్రను పోషిస్తోంది. అదేవిధంగా రత్నా సెల్యూలాయిడ్స్ పతాకంపై, బాలాజీ ఎన్ సాయి దర్శకత్వంలో రూపొందుతోన్న కొత్త చిత్రంలోనూ ఈ బెంగాలీ ముద్దుగుమ్మ ప్రధాన పాత్ర పోషిస్తోందని సినీ వర్గాల ద్వారా తెలిసింది.
ఇంకేముంది..? అగ్రహీరోయిన్లకే అంతగా అవకాశాలు లభించని ప్రస్తుత పరిస్థితుల్లో ఈ యంగ్ హీరోయిన్ మూడు చిత్రాల్లో బిజీబిజీగా ఉండటం గొప్ప విషయమే కదా..!?