1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు

టాలీవుడ్‌లో సోనియా హ్యాట్రిక్!?

వినోదం వెండితెర గుసగుసలు టాలీవుడ్ సోనియా హ్యాట్రిక్ హ్యాపీడేస్ వినాయకుడు కృష్ణుడు రాజీవ్ కర్లింగ్ హెయిర్ స్టైల్
హ్యాపీడేస్ చిత్రంలో "జూనియర్లు సీనియర్లను క్వశ్చన్ చేయకూడదు" అనే డైలాగ్‌తో కుర్రకారును ఆకట్టుకున్న కర్లింగ్ హెయిర్ స్టైల్ సుందరి సోనియా. హ్యాపీడేస్ తర్వాత "వినాయకుడు" సినిమాతో ఇంకా ప్రేక్షకులకు దగ్గరైంది. కేవలం ఒకే ఒక్క చిత్రంతో ఏకంగా స్టార్‌ హీరోయిన్‌ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న ఈమె టాలీవుడ్‌లో హ్యాట్రిక్ సృష్టిస్తోందని సినిమా వర్గాల్లో టాక్.

హీరోయిన్ కావడానికి మిలమిల మెరిసిపోయే చర్మసౌందర్యం లేకపోయినా, ఆమె చూపుల్లో ఏదో తెలియని కిక్‌ ఉందని ఫిలిమ్ నగర్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. రెండు సినిమాలకే ఓ ఇమేజ్‌ను సృష్టించుకున్న సోనియా, ఇంకా భవిష్యత్తులో సరైన గుర్తింపునిచ్చే పాత్రలు మరిన్ని పోషించాలని భావిస్తోంది.

తాజాగా.. నోట్‌బుక్ ఫేమ్ రాజీవ్ కథానాయకుడిగా, వినాయకుడు ఫేమ్ కృష్ణుడు కాంబినేషన్‌లో రూపుదిద్దుకునే కొత్త చిత్రంలో సోనియా నటిస్తోంది. విజయ్ గణపతి క్రియేషన్స్ పతాకంపై ఎం. రామలింగరాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి, జొన్నలగడ్డ శ్రీనివాసరావు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంతో సోనియా టాలీవుడ్‌లో హ్యాట్రిక్ సృష్టిస్తుందని సినీ వర్గాల్లో వార్తలు షికార్లు చేస్తున్నాయి.
About Writer
SELVI.M