రెస్టారెంట్ ఏర్పాటుకు కత్రీనా సన్నాహాలు!
|
ఈ విషయమై కత్రీనాను కదిలిస్తే.. లండన్, న్యూయార్క్ వంటి సిటీల్లో పోలిన రెస్టారెంట్‌ను ఏర్పాటు చేయాలన్నదే తన లక్ష్యమంటోంది. కాఫీ షాఫ్ లాంటి రెస్టారెంట్‌ను ముంబై నగరంలో త్వరలో నెలకొల్పే దిశగా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె తెలిపింది. దీనికి సంబంధించి రెస్టారెంట్ బిజినెస్‌లో అనుభవం కలిగిన వారితో కత్రీనా చేతులు కలుపనున్నట్లు కత్రీనా పేర్కొంది.
ఇకపోతే.. ప్రస్తుతం బాలీవుడ్‌లో బిజీబిజీగా ఉన్న కత్రీనా, తను నెలకొల్పే రెస్టారెంట్‌ను బాధ్యతగా నిర్వహించే నమ్మకమైన వ్యక్తి కోసం గాలిస్తున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాలు వెల్లడించాయి.
