1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. పెళ్లైనా పర్లేదు.. మళ్లీ తెరపై కన్పిస్తా..!

పెళ్లైనా పర్లేదు.. మళ్లీ తెరపై కన్పిస్తా..!

వినోదం వెండితెర గుసగుసలు బాలీవుడ్ అయేషా టకియా పెళ్లి ఆగను మళ్లీ తెర మాధవన్ రేవతి ప్యార్ తుమ్ మిల్ గయే
బాలీవుడ్ ముద్దుగుమ్మ, సూపర్ బ్యూటీ అయేషా టకియా మళ్లీ తెరపైకి రానుంది. ఇటీవలే తన బాయ్‌ఫ్రెండ్ ఫర్హాన్ అజ్మీతో అయేషా వివాహం వైభోగంగా జరిగింది. ప్రస్తుతం పెళ్లికి తర్వాత కొందరు హీరోయిన్లు సినిమా ఇండస్ట్రీకి గుడ్‌బై చెబుతుంటే, మరికొందరు మ్యారీడ్ కథానాయికలకు ఛాన్సులే లభించడం లేదు. ఈ నేపథ్యంలో.. పెళ్లయ్యాక కూడా తను సినిమాకు దూరం కానని, తిరిగి తెరపై కన్పిస్తానని అయేషా అంటోందట.

ఇందులో భాగంగా, పెళ్లికి ముందే సంతకం చేసిన "ప్యార్ తుమ్ మిల్ గయే" సినిమా షూటింగ్‌ ముగింపు దశకు చేరుకుందని తెలిసింది. ముంబైలో ఏప్రిల్ నెల మొత్తం దాదాపు 30 రోజుల పాటు ఈ షూటింగ్ జరుగుతుందని చిత్ర యూనిట్ సమాచారం. మాధవన్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాలో అయేషా కథానాయికగా నటిస్తోంది.

జయా బచ్చన్, రవీనా తాండన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న "ప్యార్ తుమ్ మిల్ గయే", ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసింది. టాకియా భర్త ఫర్హాన్‌కు ఈ సినిమా కథాంశం నచ్చడంతోనే టకియాకు నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు షికార్లు చేస్తున్నాయి.

ఇకపోతే.. "ప్యార్ తుమ్ మిల్ గయే" షూటింగ్‌ను పూర్తిచేసుకుని అయేషా మరో సినిమాకు కాల్షీట్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని తెలిసింది. రేవతి దర్శకత్వం వహిస్తోన్న "ప్యార్ తుమ్ మిల్ గయే" తమిళ చిత్రానికి రీమేక్.
About Writer
SELVI.M