1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. రాణి ముఖర్జీ భలే కష్టపడుతోందట.!

రాణి ముఖర్జీ భలే కష్టపడుతోందట.!

వినోదం వెండితెర గుసగుసలు రాణి ముఖర్జీ కష్టం అమీర్ కాన్ సత్యజిత్ చౌరాసియా శిక్షణ యోగా వ్యాయామాలు స్వీట్లు ఆయిల్ ఫుడ్
బాలీవుడ్ అగ్ర హీరోయిన్, ఖాందాల గర్ల్ రాణి ముఖర్జీ భలే కష్టపడుతోందట.!. ఆమె తదుపరి చిత్రంలో ముఖర్జీ క్రీడాకారిణిగా నటిస్తోందని, ఆ పాత్రకు తగినట్లుగా అమీర్ ఖాన్ ట్రైనర్ సత్యజిత్ చౌరాసియా వద్ద రాణి శిక్షణ పొందుతుందని సినీ వర్గాల్లో వార్తలు షికార్లు చేస్తున్నాయి.

స్పోర్ట్స్ పర్సన్‌గా రాణి ముఖర్జీ పోషించే పాత్రకు మంచి గుర్తింపు లభిస్తుందని, దీనికోసం వ్యాయామాలు, యోగా, బరువు తగ్గే వ్యాయామాలను తెగ చేసేస్తోందని సినీ వర్గాల్లో టాక్. రోజు మార్చి రోజు చేయాల్సిన ఈ వ్యాయామాల కోసం ముఖర్జీ తన షూటింగ్ షెడ్యూల్‌ను కూడా కాస్త మార్పు చేసుకుందని తెలిసింది.

ఇకపోతే... సత్యజిత్ ఇచ్చే శిక్షణలో పాపం రాణి ముఖర్జీ శరీరం బాగా అలసిపోతుందట. శ్రమజీవిలా ఆమెకు చెమటలు పట్టేస్తున్నాయట. బరువు తగ్గే కోసం ముఖర్జీ వెయిట్ లిఫ్టింగ్ వ్యాయామం చేస్తుందని, దీంతో దాదాపు అరగంట పాటు ఆమె చర్మం చెమటలో తడిసి ముద్దయిపోతుందని సత్యజిత్ చౌరాసియా తెలిపారు.

ముఖర్జీ తదుపరి చిత్రం కోసం వ్యాయామాలతో మాత్రమే సరిపెట్టుకోగా, ఆహారం తీసుకునే విషయంలో చాలా జాగ్రత్తలు పడుతోందని చౌరాసియా చెప్పారు. ఇందులో భాగంగా.. ఆయిల్ ఫుడ్, స్వీట్లకు అమ్మడు గుడ్‌బై చెప్పేసిందని ఆయన అన్నారు. ఇంకేముంది...? ఇంత కష్టపడుతున్న రాణికి ఆ పాత్ర ఎంతమేరకు గుర్తింపు సంపాదించి పెడుతుందో వేచి చూడాల్సిందే..!