1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు

"గాలి" కబుర్లు మంచివేనంటున్న అమృతారావు

అమృతా రావు అతిథి మహేశ్ బాబు గాసిప్స్ ఆరోగ్యం హాని ఎంజాయ్
IFM
"అతిథి" అమృతా రావు గుర్తుందా.. ఎందుకు గుర్తుండదు. ఆ మధ్య అతిథి చిత్రం తర్వాత కూడా మహేశ్ బాబుతో ఫోనుల్లో మాట్లాడి తెగ వేధించిందని వార్తలు కూడా వచ్చాయిగా. అన్నట్లు ఈ బుర్రముక్కు భామ గాసిప్స్‌ను భలే ఎంజాయ్ చేస్తుందట. గాసిప్ కబుర్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ఎవరో చెప్పారట. అంతే.. అప్పటి నుంచి తనపై ఏమేం గాలి కబుర్లు వస్తాయో తెలుసుకుని విరగబడి నవ్వుకుంటూ ఉంటుందట.

గాసిప్ కబుర్ల మర్మం గురించి ఓ పిల్ల జర్నలిస్టు అమృతను కదిలిస్తే ఇలా చెప్పుకొచ్చిందట. "ఇరుగమ్మ, పొరుగమ్మల పోచుకోలు కబుర్లు మనకెందుకు అనుకుంటాం కానీ ఈ కబుర్లు ఒత్తిడిని తగ్గిస్తాయట. ఎవరికీ ఇబ్బంది కలిగించని హానిలేని రీతిలో చెప్పుకునే ఇచ్చకాలు ఒకింత సంతోషాన్ని కలిగిస్తాయట. ఓ ఆడా, మగా ఇద్దరూ కలిసి ఓ ప్రక్కకెళ్లి మాట్లాడుకుంటే చాలు... వాళ్లిద్దరి మధ్య ఏదో ఉందని మిగిలిన వ్యక్తులు మాట్లాడుకోవడం సహజమై పోయింది.

వాళ్లిద్దరి మధ్య ఎలాంటి సంభాషణ చోటుచేసుకుందన్న ఆలోచనలను మాటల రూపంలో ఇతరులతో పంచుకోవడం భలే ఆనందాన్నిస్తుందట. ఒత్తిడిని మాయం చేస్తాయట. ముఖ్యంగా సెలబ్రిటీలు, బాస్, సహచరులు, సహోద్యోగులు, బంధుమిత్రులు, ఎవరి గురించైనా ఇటువంటి గాసిప్పులలో చోటు ఉంటుందని తెలుసుకున్నా.

ఇంట్లో, ఆఫీసులో, పార్టీలో, ఫంక్షన్లో ఎక్కడైనా ఈ కబుర్లకు వేదిక చేసుకోవచ్చు. జీవితంలోని కష్టాలను తప్పించుకునే మహత్తర మార్గం గాసిప్. అయితే గాసిప్ మంచిది కావాలే తప్ప ఇతరుల మనోభావాలను దెబ్బ తీసే విధంగా ఉండకూడదు" అని గడగడా చెప్పేసింది అమృత.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(NIFT) హైదరాబాదులో సిపిఎఫ్‌సి కోర్సు చేసారు. జర్నలిజంలో రెండు దశాబ్దాలకు పైగా అనుభవం. కవితలు, కథలు రాస్తుంటారు. ప్రముఖ మీడియా సంస్థలలో పనిచేసారు..... మరింత చదవండి