బాలీవుడ్‌లో మారుమ్రోగుతున్న ప్రీతి జింటా పేరు!
|
అంతేగాదు.. ప్రీతిజింటా దత్తత తీసుకున్న పిల్లలపైనే ప్రస్తుతం బాలీవుడ్ హాట్ టాపిక్ అని సినీ విశ్లేషకులు అంటున్నారు. అయితే ప్రీతి జింటా మాత్రం ఈ అనవసర ప్రచారాల్ని, ఊహాగానాలను కొట్టిపారేస్తుంది. పిల్లలపై, తనపై అనవసరంగా పబ్లిసిటీ చేయడం తనకిష్టం లేదని అంటోదట.
దత్తత తీసుకున్న రిషికేష్ చెందిన పిల్లల సమస్త బాధ్యతలను తానే చూసుకుంటానని ప్రీతి చెబుతోంది. ఇక నుంచి ప్రతి ఏటా కొంత మంది పిల్లలను దత్తత తీసుకోవాలన్న తన నిర్ణయాన్ని ఇదివరకే ప్రకటించానని మీడియాకు మరోసారి గుర్తు చేసింది.
అయితే.. పిల్లలను దత్తత తీసుకున్న విషయంపై అనవసరమైన ప్రచారం వద్దంటున్న ప్రీతి జింటాపై ప్రశంసల వెల్లువ ఏ మాత్రం తగ్గడం లేదట. ఇలా పబ్లిసిటీ కోరుకోని ప్రీతి జింటాకు ఎంత సహృదయమని సినీ ఇండస్ట్రీ వర్గాలు తెగ మెచ్చేసుకుంటున్నాయట..!.
