బాయ్స్, బొమ్మరిల్లు వంటి సినిమాల ద్వారా టాలీవుడ్‌లో అగ్ర హీరోయిన్‌గా ముద్రవేసుకున్న అందాల ముద్దుగుమ్మ జెనీలియా. "తుజే మేరి కసమ్" సినిమా ద్వారా బాలీవుడ్ తెరంగేట్రం చేసిన జెనీలియా, ఆ తర్వాత దక్షిణాది చలన చిత్ర రంగంలో అడుగు పెట్టడంతో, హిందీ సినిమాల్లో నటించే ఛాన్స్‌లను చేజార్చుకుంది.
జెన్నీ బాయ్‌ఫ్రెండ్ అని ఇటీవల వార్తల్లోకెక్కిన రితేష్ దేశ్‌ముఖ్‌తో నటించిన "తుజే మేరి కసమ్" జెనీలియాకు అంత పేరు సంపాదించి పెట్టలేకపోయింది. ఆ తర్వాత "బొమ్మరిల్లు" సినిమా ఆమె సినీ కెరీర్‌ను మలుపు తిప్పింది. హాసినిగా నవ్వుల సుందరిగా ముద్రవేసుకున్న జెన్నీకి, ప్రస్తుతం బాలీవుడ్‌లో అవకాశాలు వెల్లువల్లా వస్తున్నాయట.
తాజాగా జాన్ అబ్రహాం దర్శకత్వం వహించి, గుడ్ ఫిలింమేకర్స్ పతాకంపై రూపుదిద్దుకుంటోన్న చిత్రంలో జెనీలియా నటిస్తోందట. ఇంతేకాదు.. బాలీవుడ్ అగ్ర హీరోయిన్లు రాణి ముఖర్జీ, ప్రీతిజింటా యాడ్ కాల్షీట్లను కూడా జెనీలియా కైవసం చేసుకుంటోందట. ప్రస్తుతం "వాటికా" హెయిర్ ఆయిల్, "ఫెయిర్ అండ్ లవ్లీ" యాడ్స్‌లో నటించిన జెనీలియా, రాణి ముఖర్జీ ఫాంటా యాడ్‌ను లాగేసుకుంది. అదేవిధంగా ప్రీతి జింటా ఇంతవరకు చేస్తుండిన "పర్క్" వాణిజ్య ప్రకటనలోనూ జెనీలియా నటిస్తోంది.
ఇంకేముంది..? జెనీలియా వయస్సు, చలాకీతనమే సినిమా అవకాశాలతో పాటు వాణిజ్య ప్రకటనలను కూడా ఆమె ఖాతాలో వేసుకునేట్లు చేసిందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.