ఛార్మి "మనోరమ" ఫలించేనా?
|
చిన్న చిత్రాలు నిర్మించే నిర్మాతలే ఆచితూచి అడుగులేస్తుంటే, కోట్లు పెట్టే సంస్థ వాల్యూస్‌లేని కథతో ఎలా సినిమా తీసిందని ఇండస్ట్రీ అవాక్కయింది. ఆ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా నటుడు సురేష్ బాధ్యతలు చేపట్టారు. ఆయన సక్రమంగా బాధ్యతలు నిర్వర్తించలేదని అప్పట్లో వార్తలొచ్చాయి. ఇందులో విశేషమేమిటంటే..? రెండో చిత్రానికి కూడా సురేష్ బాధ్యతలు నిర్వహించారు. ఛార్మి ప్రధాన పాత్ర పోషించే "మనోరమ" సినిమా ఉగాది కానుకగా (27వ తేదీ) విడుదల కానుంది.
ఇటీవలే ఈ చిత్రాన్ని కొంతమంది ప్రముఖులకు ప్రదర్శించారు. ఈ చిత్ర కథ గోగుల్‌ఛాట్ బాంబు పేలుళ్ల కాన్సెప్ట్‌తో ఉందని తెలిసింది. మరోవైపు ఓ ప్రేమకథా నేపథ్యంలో కొనసాగుతుందని సినీ వర్గాల సమాచారం. ఇంతకీ మనోరమ అనే పేరు ఛార్మిది కాదట. ఓ హోటల్‌పేరని, అక్కడికి ఛార్మి వస్తుందని తెలిసింది.
అంతేకాదు.. టైటిల్‌కు ఛార్మీకి ఏమాత్రం సంబంధం లేదని చూసిన వారు చెబుతున్నారు. సినిమా పూర్తయ్యాక వారిని టీవీ ఛానల్స్ ముందుకు వచ్చి మొహమాటానికి ఆ సీన్ బాగుంది. ఈ సీన్ బాగుందని చెప్పారే మినహా, కథ బాగుందని, దర్శకుడు బాగా తీశాడని ఎవ్వరూ చెప్పలేకపోయారు. అంతా బయటకు వచ్చాక, మళ్ళీ జీటీవీ పప్పులో కాలేసిందని అనుకోవడం విశేషం. సో.. ఇంకా తెలియాలంటే.. ఈ నెల 27వ తేదీ వరకు ఆగాల్సిందే..!
