1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. నమితకు కేరళ అభిమానులు ఎక్కువట!

నమితకు కేరళ అభిమానులు ఎక్కువట!

వినోదం వెండితెర గుసగుసలు నమిత కేరళ అభిమానులు సెక్సీ సింబల్ కోలీవుడ్ టాలీవుడ్ మలయాళం బ్లాక్ స్టాలిన్ కళాభవన్ మణి
సెక్సీ సింబల్, అందాల బొద్దుగుమ్మ నమితకు ఈ మధ్య కేరళలో అభిమానులు ఎక్కువయ్యారట. నమిత ఎక్కడ షూటింగ్‌కు వెళ్తుందో అక్కడ ఆమె కేరళ అభిమానులు ఉంటున్నారట. కోలీవుడ్, టాలీవుడ్‌ ప్రేక్షకులను తన అందచందాలతో ఆకట్టుకున్న ఈ జగన్మోహిని, తాజాగా మలయాళ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది.

మలయాళంలో ప్రమోద్ పాప్పన్ దర్శకత్వం వహిస్తూ, కళాభవన్ మణి హీరోగా నటిస్తోన్న "బ్లాక్ స్టాలిన్" చిత్రంలో నమిత బార్ డ్యాన్సర్ పాత్రను పోషిస్తోంది. ఈ సినిమా కోసం నమిత భారీ పారితోషికం పుచ్చుకుందని సినీ వర్గాల్లో వార్తలు షికార్లు చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో "బ్లాక్ స్టాలిన్" సినిమా షూటింగ్ అథిరపళ్లి అనే ప్రాంతంలో జరుగుతుండగా, నమిత అభిమానులు భారీ ఎత్తున ఆ ప్రాంతానికి చేరుకున్నారట. దీంతో చిత్ర యూనిట్ యాజమాన్యం నమితకు అదనపు భద్రతను కల్పించారట. అథిరపళ్లి వాటర్ ఫాల్స్‌లో ఓ పాట చిత్రీకరణ జరుగుతోంది.

ఆ ప్రాంతంలో గుమికూడిన తన అభిమానులను చూసి నమిత తెగ మురిసిపోయిందట. తనకు అభిమానులంటే చాలా ఇష్టమని, షూటింగ్‌కు అంతరాయం లేకుండా అభిమానాన్ని వెలిబుచ్చాలని ఫ్యాన్స్‌ను నమిత ఆ సందర్భంలో కోరుకున్నట్లు తెలిపింది. ప్రస్తుతం నటిస్తోన్న బ్లాక్ స్టాలిన్‌లోనూ గ్లామరస్ పాత్ర పోషిస్తున్నానని ఈ సెక్సీ సైరన్ వెల్లడించింది.