1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. మాజీ ప్రియుడితో మళ్లీ తెరపైకి బిపాసా!

మాజీ ప్రియుడితో మళ్లీ తెరపైకి బిపాసా!

వినోదం వెండితెర గుసగుసలు మాజీ ప్రియుడు దినోరా మోరియా బిపాసా బసు కొత్త చిత్రం జాన్ అబ్రహాం ప్రేమ డేటింగ్
ఈ మధ్య మాజీ ప్రియులతో సినీతారలు చెట్టాపట్టాలేసుకుని తిరగడం ఫ్యాషనైంది. తాజాగా మాజీ ప్రియుడు దినో మోరియాతో, సెక్సీతార, బిపాసా బసు మళ్లీ తెరపై కన్పించబోతోంది. 2002 సంవత్సరం మధ్యలో దినో మోరియాతో బిపాసా బసు ప్రేమాయణం కొనసాగిస్తోందని వార్తలు గుప్పుమన్నాయి.

అంతేకాదు.. వారిద్దరి మధ్య సరస సల్లాపాలు కూడా జరిగిపోయాయని సినీ వర్గాల్లో వార్తలు షికార్లు చేశాయి. అయితే "రాజ్" చిత్రానికి తర్వాత దినో మోరియా ప్రేమకు బిపాసా బ్రేక్ వేసేసిందని, దీంతో దినో లారా దత్తా వెంటపడ్డాడని బాలీవుడ్ వర్గాలు తెలిపాయి.

అనంతరం నందితా మహతాని, జాన్ అబ్రహాంతో బిపాసా డేటింగ్ చేసిందని సినీ వర్గాలు చెవులు కొరుక్కున్నాయి. ప్రస్తుతం జాన్‌తో కలిసి తిరుగుతున్న బిపాసా, మళ్లీ దినోతో కలిసి కొత్త సినిమాలో నటించేందుకు అంగీకరించిందని తెలిసింది.

ఈ కొత్త సినిమా ద్వారా మధ్యలో తెగిపోయిన బిపాసా-దినో మోరియా ప్రేమ మళ్ళీ చిగురిస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి.. వీరి ప్రేమాయణం ఎంతవరకు సాగుతుందో వేచి చూడాల్సిందే.!
About Writer
SELVI.M