గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » గుసగుసలు » సెన్సార్‌ కావాలంటే పది లక్షలు పెట్టాలా..?!
గుసగుసలు
Feedback Print Bookmark and Share
 
FILE
"సినిమాలకు సెన్సార్ కావాలంటే.. పది లక్షలు ఇవ్వండి. లేదంటే మీ సినిమాలు బాక్స్‌లు మీ వద్దే ఉంచుకోండని" సెన్సార్ ఆఫీసర్ విజయ్‌కుమార్ రెడ్డి బెదిరిస్తున్నారని నిర్మాత నరేంద్ర నాయుడు ఆరోపించారు. "నేనే ముఖ్యమంత్రినైతే" అనే సినిమాలో నరేంద్ర నాయుడు ప్రధాన పాత్ర పోషిస్తూ, నిర్మాణ సారథ్యం కూడా వహిస్తున్న సంగతి తెలిసిందే.

ఎన్.ఆర్.ఐ అయిన నరేంద్రనాయుడు దాదాపు 3కోట్లతో ఈ సినిమాను నిర్మించాడు. తన సినిమాను సెన్సార్‌కు "మేస్త్రీ" చిత్రానికంటే ముందే పంపానని, కానీ తన సినిమాకు ఇంకా సెన్సార్ లభించలేదని వాపోయారు. తన సినిమాను ఎలక్షన్ ఆఫీసర్‌కు చూపించి అప్రూవ్ అయితే తమకేం అభ్యంతరం లేదని సెన్సార్ సభ్యులు చెప్పడంతో, ఎలక్షన్ ఆఫీసర్‌కు చూపించానని, ఎన్నికల అధికారి తన సినిమాకు పచ్చజెండా ఊపారని నరేంద్ర నాయుడు అన్నారు.

కానీ విజయ్‌కుమారెడ్డి ఇది ఎన్నికల సమయమని, సినిమాకు కలెక్షన్లు బాగా వస్తాయని, అందుచేత పదిలక్షల ఇస్తేనే సినిమా సెన్సార్ సర్టిఫికేట్ ఇస్తామని చెప్పారని నరేంద్రనాయుడు అన్నారు. ఇంతకుముందు రాజశేఖర్ చిత్రం సత్యమేవజయతే చిత్రానికి రెండు లక్షలు ఇచ్చారని, నీ సినిమాకు పది లక్షలు ఇవ్వడంలో తప్పేమీ లేదని విజయ్ కుమార్ రెడ్డి లాజిక్ మాట్లాడుతున్నాడని నిర్మాత వాపోయారు.

ఈ విషయాన్ని నరేంద్ర నాయుడు నిర్మాతల మండలి కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఇటువంటి విషయాలను మీడియాకు తేకండని, సమస్యను సానుకూలంగా పరిష్కరించుకోవాలని నిర్మాతల మండలి సలహా ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో తను రెండు లక్షలు ఇవ్వడానికి సిద్ధమని, ఇప్పటికే సెన్సార్ సభ్యులకు 15 వేలు ఇచ్చానని, అంతకంటే ఎక్కువ ఇచ్చుకోలేనని నరేంద్ర నాయుడు చెప్పారు.

శుక్రవారం ఉగాది, శని, ఆదివారాలు సెలవు దినాలు కావడంతో, సెన్సార్ ఆఫీసర్‌తో తాము మాట్లాడి తగు విధమైన పరిష్కారం చేస్తామని నిర్మాతల మండలిలో కొంత మంది హామీ ఇచ్చినట్లు తెలిసింది.

ఇప్పటికే తాను 27వ తేదీన తన సినిమాను రిలీజ్ చేసేందుకు థియేటర్లు బుక్ చేశానని, మళ్లీ ఏప్రిల్ నాలుగో తేదీ సినిమాను విడుదల చేయాలంటే.. థియేటర్ యాజమాన్యాలను ఒప్పించి సినిమా ప్రదర్శించుకుంటానని, ఆలోగా సెన్సార్ సమస్య పరిష్కారమయ్యేట్లు చర్యలు తీసుకోవాల్సిందిగా నిర్మాత వేడుకున్నట్లు సమాచారం.

చివరికి సెన్సార్ ఆఫీసర్ తన సినిమాకు సర్టిఫికేట్ ఇవ్వనట్లైతే.. తర్వాత ఏం చేయాలో తనకు తెలుసునని, నిర్మాతల మండలి ముందు నరేంద్ర నాయుడు గట్టిగా చెప్పినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా.. ఇప్పటికే సెన్సార్ ఆఫీసర్ విజయ్‌కుమార్ రెడ్డిపై పలు ఆరోపణలున్నాయి.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: వినోదం వెండితెర గుసగుసలు సెన్సార్ పదిలక్షలు నేనే ముఖ్యమంత్రినైతే నరేంద్ర నాయుడు ఆఫీసర్ విజయ్ కుమార్ ఏప్రిల్