"ప్లేబాయ్" బ్రాండ్ అంబాసిడర్‌గా మల్లికా?
బాలీవుడ్ సెక్సీతార, అందాల ముద్దుగుమ్మ మల్లికా షెరావత్ "ప్లే బాయ్" అనే పెర్‌ఫ్యూమ్ బ్రాండ్ అంబాసిడర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నట్లు సినీ వర్గాల్లో వార్తలు షికార్లు చేస్తున్నాయి. అమెరికాకు చెందిన ప్లే బాయ్ కంపెనీ ప్రాడెక్టుకు బ్రాండ్ అంబాసిడర్‌గా నటించేందుకు మల్లికా షెరావత్ అంగీకరించిందని సినీ వర్గాల సమాచారం.
ప్రస్తుతం నాగకన్యగా "హిస్" అనే చిత్రంలో మల్లికా షెరావత్ నటిస్తోంది. అంతర్జాతీయ ప్రాజెక్ట్ అయిన ఈ చిత్రానికి జెనిఫర్ లించ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన వివరాలను మీడియాకు తెలియజేయకుండా చాలా గోప్యంగా ఉంచుతున్నారని తెలిసింది.
"హిస్" సినిమా పూర్తయ్యాక వివరాలను మీడియా ముందు వెల్లడించాలని, అప్పటి వరకు ఈ సినిమా గురించిన వివరాలను సస్పెన్స్‌గా ఉంచాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు సమాచారం.
"దశావతారం" తర్వాత మీడియాకు కాస్త దూరమైన మల్లికా, తిరిగి "ప్లే బాయ్" యాడ్‌లో కన్పించబోతోందని ఆమె అభిమానులు వేయి కనులతో ఎదురుచూస్తున్నారు.
ఇదిలా ఉండగా, అమెరికా కంపెనీకి చెందిన "ప్లేబాయ్" బ్రాండ్‌ను భారత్‌లోనూ విడుదల చేసే దిశగా ఆ సంస్థ ప్రయత్నిస్తోందని, భారత్‌లో తమ ప్రాడెక్టును మల్లికా యాడ్ షాట్ ద్వారా మంచి మార్కెట్ వస్తోందని ఆ సంస్థ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.