1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. నగ్నంగా నటిస్తోన్న మహేశ్ హీరోయిన్

నగ్నంగా నటిస్తోన్న మహేశ్ హీరోయిన్

ప్రిన్స్ మహేశ్ బాబు టక్కరి దొంగ లీసారే నగ్న చిత్రాలు బాలీవుడ్ సినీజనం
ప్రిన్స్ మహేశ్ బాబు సరసన టక్కరి దొంగ చిత్రంలో నటించిన సెక్సీ కళ్ల సుందరి లీసారే గుర్తుందా...? ఇపుడా సుందరి నగ్నంగా నటిస్తోందట. నటనా నైపుణ్యం ఏమాత్రం లేని ఈ బాలీవుడ్ తెల్లదొరసాని నగ్న చిత్రాలనే నమ్ముకున్నట్లు బాలీవుడ్ సినీజనం అంటున్నారు. ఛాన్సులకోసం బాలీవుడ్ సినీ నిర్మాతల చుట్టూ తిరిగి విసిగిపోయిన ఈ సెక్సీ సుందరి చివరికి నగ్న నటనకు దిగిందని భోగట్టా.

ఇంగ్లండు థ్రిల్లర్ చిత్రాలలో ఎక్కువగా లీసారే నగ్న నటనకు ఆసక్తి చూపుతోందట. ఆమె నటించిన పలు చిత్రాల డీవీడీలు తాజాగా భారతీయ మార్కెట్లను ముంచెత్తుతున్నాయట. ఇంగ్లీషు చిత్రం "కిల్ కిల్ ఫాస్టర్ ఫాస్టర్"లో ఆమె మితిమీరిన సెక్స్ దృశ్యాలతో ఇంగ్లండు ప్రేక్షకులను శృంగార సముద్రంలో ముంచి లేపిందట.

భారతీయ చిత్రాలలో నటించాలని తాను ఎంతగానో ఉవ్విళ్లూరాననీ, ఈ క్రమంలో తాను టాలీవుడ్ హీరో మహేశ్‌తో 'టక్కరి దొంగ'లోనూ, కోలీవుడ్ స్టార్ శరత్ కుమార్‌తో నేతాజీ చిత్రంలోనూ చేశానని చెప్పింది. అయితే తన కెరీర్ యాక్షన్ చిత్రాలవైపు కాక శృంగారభరిత చిత్రాలవైపు సాగిందని లీసారే ఆనందంగా చెపుతోందట.

తన ఆకృతిని చూసిన ఇంగ్లండ్ సినీ నిర్మాతలు ప్రత్యేకంగా తనకు పిలిచి అవకాశాలు ఇస్తున్నారని చెపుతోందట. అవును మరీ... టాలీవుడ్ తారలకు బాలీవుడ్ అంటే ఎంత క్రేజో బాలీవుడ్ సెక్సీ"బాంబు"లకు హాలీవుడ్ చిత్రాలలో నటించడమంటే అంత క్రేజు.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT