శిల్పాశెట్టి తల్లిగా జయప్రద..!
|
ప్రముఖ దర్శకులు బుద్ధదేవ్ దాస్ గుప్తా, మురుగదాస్‌లు చెప్పిన కథ చాలా బాగా నచ్చిందని, అందుకే ఆ చిత్రంలో నటించేందుకు అంగీకరించానని జయప్రద చెబుతోంది.
"ద డిజైర్" అనే పేరుతో రూపుదిద్దుకోనున్న ఈ సినిమాలో జయప్రద ఓ నాట్య గురువుగా కీలక పాత్ర పోషిస్తున్నట్లు వెల్లడించింది. ఒక ఒడిస్సీ నాట్యకారిణిగా ఈ సినిమాలో కన్పిస్తానని, ఇలాంటి పాత్ర కోసమే చాలా రోజులు ఎదురుచూస్తున్నానని, ఇందులో శిల్పాశెట్టి తల్లిగా నటిస్తోంది.
