Lara and Dino split over ex lovers | లారాదత్తను దినో వదిలేశాడట...!
బాలీవుడ్ సెక్సీతార లారాదత్త ఒంటరిదైందని సినీ వర్గాల్లో వార్తలు గుప్పుమన్నాయి. తన బాయ్‌ఫ్రెండ్ దినో మోరియాతో కలిసి హ్యాపీగా ఉన్న ఈమెకు ప్రస్తుతం తోడు లేదట. మాజీ ప్రేయసి డిజైనర్ నందితా మహ్తానీతో దినో మోరియా కలిసి తిరుగుతున్నాడని, పాపం లారాదత్తను అతడు వదిలేశాడని ఓ ఫిల్మ్ మ్యాగజైన్ వెల్లడించింది.
దినో మోరియా ఎలాగో మాజీ ప్రేయసిని వెతుక్కుంటూ వెళ్లాడో? అదే విధంగా.. లారా కూడా తన మాజీ బాయ్‌ఫ్రెండ్ కెల్లీ డార్జ్‌ను మళ్లీ కలుసుకోనుందని ఆ మ్యాగజైన్ తెలిపింది.
దినో, లారాలు కలిసి ఓ చోటికి వెళ్లడం లేదని, ఇద్దరూ వారి దారిన వారు వెళ్తున్నారని ఆ మ్యాగజైన్ పేర్కొంది. ఈ నేపథ్యంలో మార్చి 28వ తేదీన జరిగిన క్వీనీ దోడీస్ పార్టీకి లారా ఒంటరిగానే వెళ్లిందని, ఇటీవల జరిగిన ఫ్యాషన్ వీక్‌లోనూ దినో, లారాతో కలిసి వెళ్లలేదని వార్తలొచ్చాయి.
అయితే లారాను వదిలిపెట్టి నందితాతో, దినో చెట్టాపట్టేలేసుకుని తిరుగుతున్నాడని తెలిసింది. దీంతో మండిపడిన లారా, దినోతో మాట్లాడటం ఆపేసిందట. అంతేకాదు.. తన మొబైల్ నెంబర్ కూడా మార్చేసిందట. ప్రస్తుతం థాయిలాండ్‌లో "బ్లూ" సినిమా షూటింగ్‌లో బిజీబిజీ ఉన్నా ఈ భామ, ఈ ప్రేమ వ్యవహారంతో చాలా అప్‌సెట్ అయిందని సినీ యూనిట్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.