Rajinikanth Arranged Buttermilk center for koolis | "రోబో" మజ్జిగ పంచాడట..!
ప్రముఖ దర్శకుడు శంకర్ డైరక్షన్‌లో సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం "రోబో" (తమిళంలో యందిరన్). ఈ సినిమాలో మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ హీరోయిన్‌గా నటిస్తోంది. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో రోబో షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్న రజనీకాంత్ ఈ మధ్య కొంత బ్రేక్ రావడంతో, తీరిక వేళల్లో చెన్నైలోని కేలంబాక్కంలో ఉన్న తన ఫామ్‌హౌస్‌కు వెళ్తుంటారు.
ఇలా.. ఇటీవల విశ్రాంతి తీసుకుందామని, ఫామ్‌హౌస్‌కు రజినీకాంత్ బయలుదేరి వెళ్లారు. అక్కడ కూలీలు మండుటెండలో పనిచేయడం ఆయనకు కనిపించగానే, అప్పటికప్పుడు తన సిబ్బంది ద్వారా మజ్జిగ కోసం పురమాయించారు.
తర్వాత మజ్జిగను స్వయంగా తన చేతుల మీదుగానే కూలీలందరికీ అందించారు. దీనికి తోడు ఆ ఏరియా మీదుగా వెళ్తున్న పాదచారుల కోసం ఫామ్‌హౌస్ సమీపంలో ఒక షెడ్ వేయించి మజ్జిగ కేంద్రం ఏర్పాటు చేశారు. ఆ రోజంతా రజనీ స్వయంగా మజ్జిగ పంచుతున్నారని తెలిసి అభిమానులు పెద్ద ఎత్తున ఆ ప్రాంతానికి తరలి వచ్చారట.