Charmi's Humor formula | ఆరోగ్యానికి ఛార్మీ హ్యూమర్ ఫార్ములా
|
రోజులో నవ్వే సందర్భాలు కలుగకపోతే, వాళ్ల తాతయ్య తనకు చిన్నప్పుడు కొనిచ్చిన చాప్లిన్ టేల్స్ పుస్తకాన్ని తీసి చాప్లిన్ హాస్యపు బొమ్మలు చూసి తెగ నవ్వుకుంటుందట. అలాగే చాప్లిన్ నటించిన క్యాసెట్లు చూస్తుంటుందట.
అన్నట్లు ఛార్మి నవ్వుల ఫార్ములాను తన స్నేహితులు కూడా ఆచరిస్తుంటారట. తన వద్దనున్న చాప్లిన్ క్యాసెట్లను వాళ్లు కూడా అప్పుడప్పుడు తీసుక వెళుతుంటారట. ఆ సమయంలో తను ఖచ్చితంగా నవ్వాలనుకుంటే, టామ్ అండ్ జెర్రీ క్యాసెట్లు వేసుకుని విరగబడి నవ్వుతుందట.
ఇలా రోజుకు కనీసం రెండు మూడు గంటలు నవ్వుతూ ఉండటం వల్ల ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటానని చెపుతోందట.
