Katrina tattoos on her chest | ఛాతీపై టాటూ అంటించుకున్న కత్రీనా కైఫ్..!
హాలీవుడ్ స్టార్ ఏంజెలీనా జోలీ, బాలీవుడ్ ముద్దుగుమ్మలు అమిర్తా అరోరా, లారా దత్త, మలైకా అరోరా ఖాన్, దీపికా పడుకునే సరసన, ఆసియా అందగత్తె పొడువు కాళ్ల సుందరి కత్రీనా కైఫ్ చేరింది. తమ అందాల స్కిన్‌పై టాటూలను అంటించుకుని ఇట్టే ప్రేక్షకులను ఆకట్టుకునే సినీతారల జాబితాలో కత్రీనా కూడా చేరిపోయింది.
ఆదివారం ఓ పార్టీకి హాజరైన కత్రీనా, తన ఛాతిపై టాటూను అంటించుకుని అందరికి షాక్ ఇచ్చిందట. అదేరోజు ఓ ఫోటో షూట్‌కు హాజరైన కత్రీనా, రాత్రి జరిగిన పార్టీకి అలాగే హాజరైందట. ఇంతవరకు టాటూల జోలికి వెళ్లని ఈ భామ టాటూను అంటించుకుని పార్టీకి హాజరు కావడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.
రణ్‌బీర్ కపూర్, కత్రీనా కైఫ్ హీరోహీరోయిన్లుగా నటించే తన "అజాబ్ ప్రేమ్ కి గహాబ్" సినిమా షూటింగ్ పూర్తయిన సందర్భంగా చిత్ర నిర్మాత రమేష్ తౌరాణి ఇచ్చిన ఆ పార్టీలో కత్రీనా టాటూ చూపరులను పెద్ద ఎత్తున ఆకట్టుకుందని సినీ వర్గాల్లో సమాచారం. అంతేకాదు.. హాట్ హీరోయిన్లు పెద్ద ఎత్తున వాడే టాటూలను కత్రీనా వాడటంలో ఏదో రహస్యముందని పార్టీలో హాజరైన ప్రముఖులంతా చెవులు కొరుక్కుంటున్నారట. ఇకపోతే ఈ పార్టీలో రాజ్‌కుమార్ సంతోషి, రణ్‌బీర్ కపూర్, ఉపేన్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.