1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. "పిస్తా" శ్రేయ: సక్సెస్ సూత్రాలు

"Pista" Sreya told Success quotes | "పిస్తా" శ్రేయ: సక్సెస్ సూత్రాలు

సెక్సీ అందాల తార శ్రేయ సక్సెస్ సూత్రం పిస్తా
వెండితెరపై అందాలను ఆరబోసే సెక్సీ అందాల తార శ్రేయ, తన సక్సెస్ సూత్రం ఏమిటో తన సన్నిహితుల వద్ద వెల్లడిస్తుందట. తన స్నేహితులెవరైనా నిరాశా, నిస్పృహలతో ఉన్నట్లయితే వారికి తన వద్ద నున్న సూత్రాలను వల్లెవేస్తుందట. తాజాగా పిస్తా చిత్రంతో ప్రేక్షకులను మురిపించడానికి వస్తున్నా ఈ "పిస్తా" శ్రేయ సక్సెస్ గురించి ఏం చెప్పిందో ఒకసారి చూద్దామా...

వ్యాపారం చేస్తున్నా, మరే వృత్తిలో కొనసాగుతున్నా, ఏదైనా కొత్త పని చేయాలని తలపెట్టినా అందులో ఎంతో ఆసక్తి కనబరచాలట. చేపట్టిన పనిలో గెలుపు పొందాలంటే ఎవరికివారు తమ చాకచక్యాన్ని, శక్తిని పరిపూర్ణంగా కేంద్రీకరించాలట.

అలవాటుపడిన పనే కదా అనే భావనతో అశ్రద్ధ చేయడమో, తప్పనిసరనో చేయకూడదట. ప్రతి క్షణం ఏదో ఒక కొత్త పని చేస్తున్నామన్న ఆసక్తితో పని చేయాలట. ఎవరికివారు తమ పనిపట్ల పూర్తి క్రియాశీలతను వెలువరించాలట. ఆసక్తితో హృదయపూర్వకంగా, శ్రద్ధగా చేయాలట. అప్పుడే జీవితంలోని ప్రతి మెట్టునూ హాయిగా దాటుకుంటూ ముందుకు సాగిపోగలుగుతారట. "పిస్తా" శ్రేయ వద్ద సక్సెస్ సూత్రాలు బాగానే ఉన్నట్లున్నాయే.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT