I Missed that chance: Jagapathy | ఆ ఛాన్స్ మిస్సైంది: జగపతిబాబు
|
అందాలనటుడు శోభన్‌బాబు తర్వాత, ఇద్దరు హీరోయిన్ల నటుడిగా జగపతిబాబు పేరు తెచ్చుకున్నారు. తాజాగా "అధినేత" అనే రాజకీయ చిత్రంలో ఆయన నటిస్తున్నారు. ఈ సినిమాలో తన సరసన నటించిన హీరోయిన్లతో ఎక్కువ సేపు సరదాగా గడపలేదని జగపతిబాబు చెబుతున్నారు. వారితో సరదాగా గడిపే ఛాన్స్ మిస్సైందని నవ్వుతూ చెప్పారు.
జగపతిబాబు అంటే ఆడవాళ్ళు పడి చస్తారని, అలాగే తాను ఉంటానని జగపతిబాబు తెలిపారు. కానీ అధినేత చిత్రం ద్వారా ఆ అవకాశం లభించలేదని, ఎందుకంటే.. షూటింగ్ చాలా తక్కులటైమ్‌లో పూర్తి చేయాల్సి వచ్చిందని ఆయన వెల్లడించారు.
మరోవైపు ఎన్నికలకు ముందే ఈ సినిమా విడుదల కావాలని నిర్మాతలు అనడంతో ఆ పనిమీదే ఎక్కువ శ్రద్ధచూపామని, సరదా విషయాలను ఏ మాత్రం పట్టించుకోలేకపోయామని జగపతిబాబు అన్నారు.
ఇంకేముంది..? నిర్మొహమాటంగా ఆడవాళ్ళపై తాననుకున్న విషయాన్ని వెల్లడించిన జగపతిబాబుకు బెటర్ లక్ నెక్స్ట్ టైమ్ అనే చెప్పాలి మరీ..!
