సినీ తారలు, సెలబ్రిటీలు ప్రముఖ మ్యాగజైన్ ముఖపుటల్లో దర్శనమివ్వడం అందరికీ తెలిసిందే. ఇదే తరహాలో బాలీవుడ్ అందాల రాశి దీపికా పడుకునే కూడా "ఎం" మ్యాగజైన్ కవర్‌పేజీలో కన్పించనుంది. ఫ్రీ హెయిర్‌తో సౌందర్య రాశిగా ఈ మ్యాగజైన్ ముఖపుటలో దీపికా పడుకునే బొమ్మ ఉందట.
అంతేగాకుండా.. దీపికా పడుకునే ఇంటర్వ్యూను కూడా ఈ మాస పత్రికలో ప్రచురితం చేస్తున్నట్లు మ్యాగజైన్ అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఆమె చిన్ననాటి సంగతులు, సినీ తారగా ఆమెకు కలిగిన అనుభూతులను ఇందులో పొందుపరిచారట. దీంతో పాటు పడుకునే రీల్ లైఫ్-రియల్ లైఫ్ వంటి అనేక అంశాలను దీపిక ఇంటర్వ్యూ ద్వారా పాఠకులు తెలుసుకోవచ్చునని వారు తెలిపారు.
ఇంకేముంది.. దీపికా పడుకునే అభిమానులు ఎం మ్యాగజైన్ కొనేందుకు ముందుంటారన్నమాట..!