Kareena gets Imtiaz to direct her | ఇంతియాజ్ దర్శకత్వంలో కరీనా యాడ్ ఫిలిమ్
బాలీవుడ్ అగ్రతార, సెక్సీక్వీన్ కరీనా కపూర్ తన ఫేవరెట్ డైరక్టర్ ఇంతియాజ్ అలి దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్న కొత్త యాడ్ ఫిలిమ్‌లో నటించనుందని ఫిలిమ్ నగర్ వర్గాల సమాచారం. ప్రస్తుతం సైఫ్ అలీఖాన్ సొంత పతాకంపై లవ్ అజ్ అర్ కల్‌కు దర్శకత్వం వహిస్తోన్న ఇంతియాజ్, బ్యూటీఫుల్ స్టార్ కరీనా కపూర్‌తో "జాబ్ వి మెట్" అనే యాడ్ సినిమాను తీసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారని తెలిసింది.
ఈ విషయమై కరీనా కపూర్ మాట్లాడుతూ... తన ఫేవరెట్ దర్శకుడు ఇంతియాజ్‌తో యాడ్ సినిమా తీసేందుకు అంగీకరించానని వెల్లడించింది. ఈ యాడ్‌లో తాను చాలా అందంగా కన్పిస్తానని కరీనా తెలిపింది.
జాబ్ వి మెట్ పేరిట రూపుదిద్దుకుంటోన్న ఈ యాడ్ ఫిలిమ్‌లో తన పాత్ర అద్భుతంగా ఉంటుందని కరీనా పేర్కొంది. అత్యుత్తమ దర్శకుడు ఇంతియాజ్ యాడ్ ఫిలిమ్‌లో తాను సరదా పాత్రను పోషించినట్లు కరీనా తెలిపింది.
ఇదిలా ఉండగా.. సైఫ్ సొంత పతాకంపై రూపొందుతోన్న "లవ్ అజ్ అర్ కల్" సినిమాలో దీపికా పడుకునే హీరోయిన్‌గా నటిస్తోంది. కరీనా ఫేవరేట్ దర్శకుడైన ఇంతియాజ్ లవ్ అజ్ కర్‌లో హీరోయిన్ ఛాన్స్‌ను కరీనాకు ఎందుకివ్వలేదని బాలీవుడ్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.