1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు
  6. సల్మాన్-కత్రీనా-అసిన్‌ల ముక్కోణపు ప్రేమ!

సల్మాన్-కత్రీనా-అసిన్‌ల ముక్కోణపు ప్రేమ!

వినోదం వెండితెర గుసగుసలు సల్మాన్ ఖాన్ కత్రీనా కైఫ్ అసిన్ల ముక్కోణపు ప్రేమ గజినీ అమీర్ అమీర్ ఖాన్ లండన్ డ్రీమ్స్
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, అందాల సుందరి కత్రీనా, అసిన్‌ల మధ్య ముక్కోణపు ప్రేమాయణం నడుస్తోందని బాలీవుడ్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. బాలీవుడ్ చిలకాగోరింకల్లా ఇన్నాళ్ళు సాఫీగా గడిపిన ప్రేమికులు సల్మాన్-కత్రీనాల మధ్య, గజినీ భామ ఎక్కడ నుంచో ఊడిపడిందని సినీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నారట.

"గజినీ" సినిమా ద్వారా బాలీవుడ్‌కు పరిచయమైన అందాల తార అసిన్, కండల వీరుడు సల్మాన్ ఖాన్‌ల మధ్య ఏదో కొత్త కథ నడుస్తుందనే వార్తలు ఫిలిమ్ నగర్ వర్గాల్లో గుప్పుమన్నాయి.

కానీ ఈ వదంతులపై సల్మాన్ ఖాన్-కత్రీనా కైఫ్‌లు నోరు విప్పడం లేదట. అయితే గజినీ భామ పై వార్తలన్ని వదంతులేనని స్పష్టం చేసింది. సల్మాన్ ఖాన్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని, వృత్తిపరంగా ఆయనతో కలిసి నటించడం మాత్రమే చేస్తున్నానని అసిన్ తేల్చి చెప్పేసింది. ప్రస్తుతం సల్మాన్ ఖాన్‌ "లండన్ డ్రీమ్స్" చిత్రంలో అసిన్ కథానాయికగా నటిస్తోంది.