1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు
  6. పొడవాటి కురుల కోసం బిపాసా పాట్లు!

Bipasha to sport long hair | పొడవాటి కురుల కోసం బిపాసా పాట్లు!

వినోదం వెండితెర గుసగుసలు పొడవాటి కురులు బిపాసా బసు పాట్లు రోహిత్ శెట్టి అజయ్ దేవ్గన్
ప్రస్తుత హీరోయిన్లు స్వతహాగా తమకున్న జుట్టును వికృతంగా మార్చేసుకుని బాబ్డ్ హెయిర్‌, షార్ట్ హెయిర్ అంటూ ఫ్యాషన్ల బాట పడుతుంటే... బాలీవుడ్ హాట్ క్వీన్ బిపాసా బసు మాత్రం పొడవాటి కురుల కోసం పడరాని పాట్లు పడుతోందట. రోహిత్ శెట్టి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న తాజా చిత్రంలో బిపాసా పాత్రకు తగినట్లు తన హెయిర్‌స్టైల్‌ను మార్చేసుకుంటుందట.

గత రెండేళ్లుగా కురుచటి జుట్టుతో ప్రేక్షకులను కనువిందు చేసిన బిపాసా, ప్రస్తుతం తన కురులను పొడవుగా పెంచుకునేందుకు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. రోహిత్ శెట్టి దర్శకత్వం వహిస్తోన్న తాజా సినిమా షూటింగ్ గోవాలో ప్రారంభం కానుంది. ఇందులో అజయ్ దేవ్‌గన్ భార్యగా బిపాసా బసు నటిస్తోందని చిత్ర యూనిట్ వెల్లడించింది.

తన హెయిర్‌స్టైలిస్ట్ సప్న (భవాని) నేచురల్‌గా తన హెయిర్‌స్టైల్‌ను అందంగా మార్చేసిందని, హెయిర్ కలర్ కూడా చాలా బాగా అమరిందని బిపాసా బసు తెలిపింది. ఈ సినిమాలో తన హెయిర్ స్టైల్ ద్వారా తనకు ప్రత్యేక అందం చేకూరుతుందని బసు నమ్మకం వ్యక్తం చేసింది.
About Writer
SELVI.M