1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు
  6. బాస్కెట్ బాల్ స్టార్ ఆండ్రూతో రిహన్నా డేటింగ్..?

Rihanna dating basketball star Andrew Bynum? | బాస్కెట్ బాల్ స్టార్ ఆండ్రూతో రిహన్నా డేటింగ్..?

వినోదం వెండితెర గుసగుసలు బాస్కెట్ బాల్ స్టార్ ఆండ్రూ రిహన్నా డేటింగ్ డిన్నర్ ఎక్స్ 17 సెలబ్రిటీ వెబ్సైట్
ఆర్అండ్‌బి సూపర్ స్టార్, పాప్ గాయని రిహన్నా, బాస్కెట్ బాల్ క్రీడాకారుడు ఆండ్రూ బ్నిమ్‌తో డేటింగ్ జరుపుతోందని వార్తలు గుప్పుమన్నాయి. గతవారం లాస్ ఏంజెల్స్‌లోని బెవర్లీ హిల్స్‌లోని ఓ హోటళ్లో ఈ జంట హాయిగా డిన్నర్ ముగించుకుని, సరస సల్లాపాలు కొనసాగించినట్లు ఓ వెబ్‌సైట్ వెల్లడించింది.

డిన్నర్ కూర్చీలోనే ఈ జంట చాలా సన్నిహితంగా మెలిగారని ఆ వెబ్‌సైట్ పేర్కొంది. ఈ 21 ఏళ్ల పాప్ గాయని రిహన్నా, క్రిస్ బ్రౌన్‌తో తొలిసారిగా డేటింగ్ జరిపిందని వెబ్‌సైట్ తెలిపింది. కొన్ని నెలల తర్వాత క్రిస్ బ్రౌన్‌తో తన సంబంధాన్ని తెగతెంపులు చేసుకున్న రిహన్నా ఆండ్రూతో ప్రేమాయణం ప్రారంభించినట్లు ఎక్స్ 17 సెలబ్రిటీ వెబ్‌సైట్ అనే వెల్లడించింది.