1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు
  6. "మిత్రుడు" సలహాలను పాటిస్తాడా?

Mithrudu release on May 14? | "మిత్రుడు" సలహాలను పాటిస్తాడా?

వినోదం వెండితెర గుసగుసలు మిత్రుడు సలహాలు పాటింపు ఆర్థికమాంద్యం మే 1 మే 14 బాలకృష్ణ ప్రియమణి శివలెంక ప్రసాద్
ఆర్థికమాంద్యంతో భారీ చిత్రాల సంఖ్య గణనీయంగా పడిపోయింది. దానికి తోడు ఉన్న ఒకటి రెండు చిత్రాలు ఎప్పుడు రిలీజ్ చేయాలనే సందిగ్ధంలో ఉన్నాయి. నందమూరి బాలకృష్ణ నటించిన "మిత్రుడు", రవితేజ నటించిన "కిక్" చిత్రాలు మే మొదటివారంలో విడుదలకావాల్సి ఉండగా, కొన్ని అనివార్య కారణాలతో పై రెండు చిత్రాలు మే 14న విడుదల కానున్నాయని తెలిసింది.

ప్రస్తుతం రాష్ట్రంలో ఈ నెల 23న ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో... బాలకృష్ణ ప్రచారంలో పాల్గొన్నప్పటికీ, తన వంతు బాధ్యతగా డబ్బింగ్ పూర్తి చేశారు. ఇంకా "మిత్రుడు" సినిమా పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది.

కానీ సినీ ఇండస్ట్రీ ఆర్థికమాంద్యం దెబ్బతో కాస్త తప్పటడుగులు వేస్తోంది. బాలకృష్ణ గత చిత్రాలను బేరీజువేస్తే అన్నీ ప్లాప్‌లే. సరైన హిట్‌ సినిమాలు లేవు. దీంతో డిస్ట్రిబ్యూటర్లెవరూ "మిత్రుడు" సినిమాను రిలీజ్ చేసేందుకు ముందుకు రాలేదని విశ్వసనీయ సమాచారం. దాంతో నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాదే పంపిణీ బాధ్యతలను తన భుజాలపై వేసుకుని సొంతగా విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇప్పటికే అన్ని థియేటర్లు బుక్ కాగా, "మిత్రుడు" చిత్రాన్ని మే 14న విడుదల చేయమని బాలకృష్ణకు, ఆయన సన్నిహితులు సలహా ఇచ్చినట్లు తెలిసింది. అగ్రహీరో చిత్రాలను ఎక్కువగా యూత్ చూస్తుండడం, మరోవైపు ఎం.సెట్ మే 14న జరుగుతుండటం, మద్రాసులోనూ 13న ఎన్నికలు జరుగుతుండటం వంటి కారణాలతో ఈ సినిమాను మే 14న విడుదల చేయమని సన్నిహితులు బాలయ్యకు సూచించారని సమాచారం. దీంతో బాలకృష్ణ బుధవారం తన సన్నిహితులతో సమావేశమయ్యారని తెలిసింది.

ఏదిఏమైనా ముందుగా అనుకున్న టైమ్‌లోనే సినిమాను రిలీజ్ చేస్తామని, ఇందులో వెనుకడుగు వేసే ప్రసక్తేలేదని బాలయ్య సన్నిహితులతో చెప్పినట్లు సమాచారం. మరి "మిత్రుడు" తన సన్నిహితుల సలహాలను పాటిస్తాడా? లేదా అనేది వేచి చూడాల్సిందే..?