1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. గుళ్లకు వెళ్లేటప్పుడైనా చీరకట్టు తల్లీ..!

గుళ్లకు వెళ్లేటప్పుడైనా చీరకట్టు తల్లీ..!

వినోదం వెండితెర గుసగుసలు గుళ్లు గోపురాలు చీరకట్లు తల్లీ నయనతార కుంభకోణం భగవతి అమ్మన్ హిందూ మక్కల్ కచ్చి
ప్రస్తుతం నాగరికత ప్రభావంతో మహిళలు మోడ్రన్ డ్రస్సులపై మొగ్గుచూపుతున్నారు. షాపింగ్‌, పార్టీలు, ఆలయాలకెళ్లినా ఈ మధ్య మహిళలు సల్వార్ కమీజ్‌ వంటి మోడ్రన్ డ్రస్‌కోడ్‌లోనే దర్శనమిస్తున్నారు. ఇదే తరహాలో ఇటీవల కుంభకోణంలోని భగవతి అమ్మన్ ఆలయానికి సల్వార్ కమీజ్‌తో వెళ్లిన హీరోయిన్ నయనతారకు చిక్కొచ్చి పడింది.

ఆ ఆలయానికి వచ్చే ఆడవాళ్లు తప్పక చీరకట్టుతో రావాలన్నది నిబంధన. అయితే నయనతార సల్వార్‌తో రావడం ఆలయ నిర్వాహకులను ఆగ్రహానికి గురిచేసింది. అయితే నయన వెంటనే తనకు ఈ ఆలయ నిబంధనలు తెలియవని, తెలిసుంటే ఇలా వచ్చేదాన్ని కాదని క్షమాపణ చెప్పుకుంది.

ఈ విషయానికి దృష్టిలో పెట్టుకుని కనీసం గుళ్లుగోపురాలకు వెళ్లేటప్పుడైనా చీరకట్టు తల్లీ..! అనే విధంగా.. కుంభకోణానికి చెందిన "హిందూ మక్కల్ కచ్చి" అనే సంస్థ నయనతారకు శాఫ్రాన్ రంగు చీరను బహూకరించినట్లు తెలుస్తోంది. దక్షిణాది సంప్రదాయాలను గుర్తు చేసేందుకే నయనకు చీరను బహూకరించినట్లు సినీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.

మరి వీలుదొరికినప్పుడల్లా.. దేవుడిపై అపార భక్తితో గుళ్లకు వెళ్లే నయనతార ఇకపైనైనా పద్ధతిగా వెళ్తుందో? లేదో? వేచి చూడాల్సిందే..!