1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు
  6. పెరువియన్ ఫ్యాషన్‌ షోలో దీపికా పడుకునే!

Deepika Padukone in Peruvian heaven | పెరువియన్ ఫ్యాషన్‌ షోలో దీపికా పడుకునే!

వినోదం వెండితెర గుసగుసలు పెరువియన్ ఫ్యాషన్ షో దీపికా పడుకునే లాటిన్ అమెరికన్ ఎడిషన్ వోగ్స్ మ్యాగజైన్
అమెరికాలోని పెరువియన్ ఫ్యాషన్‌ షోకు, బాలీవుడ్ అందాల తార దీపికా పడుకునే హాజరైందట. ఈ షోకు విచ్చేసిన ఈ అందాల ముద్దుగుమ్మ దీపికకు పెరువియన్ పర్యాటక మంత్రి ఘన స్వాగతం పలికారని సినీ వర్గాల ద్వారా తెలిసింది.

ప్రముఖ వోగ్స్ లాటిన్-అమెరికన్ పత్రికకు కవర్ పేజీలో దర్శనమిస్తోన్న తొలి భారతీయ నటీమణి అయిన దీపికా పడుకునే, ఫోటో సెషన్ కోసం అమెరికాకు వెళ్లింది. లిమా, పెరు వంటి ప్రాంతాల్లో వోగ్స్ మ్యాగజైన్ కోసం దీపికా పడుకునే షూటింగ్ జరుగుతోంది.

ఇందులో భాగంగా.. ఫోటోగ్రాఫర్ మరియానా గార్సియా బర్గోస్ దీపికా పడుకునేను అద్భుతమైన లొకేషన్లలో నిలబెట్టి ఫోటోలు తీశాడట. దీంతో పనిలో పనిగా పడుకునే పెరువియన్‌లో జరిగిన ఫ్యాషన్‌ షోకు కూడా వెళ్లిందట. ఆ షోలో క్యాట్‌వాక్ చేసే అందాల రాశులను చూసి, జోరుగా చప్పట్లు కొట్టేసిందట.

ఈ సందర్భంగా దీపికా మాట్లాడుతూ.. కొత్త ప్రదేశంలో పర్యటించడం ఆనందంగా ఉందని, భాష తెలియని చోటుకి వెళ్లాలంటే, ఆ ప్రాంత భాష తెలిస్తే ఎంతో బాగుండేదని చెప్పింది. తన కాలేజీ రోజుల్లోనే ఫ్రెంచ్, స్పానిష్ కొంచెం కొంచెం నేర్చుకున్నానని, ఈ భాషలు రావడంతో.. ఇప్పడు తనకెంతో మేలు కలిగిందని దీపికా వెల్లడించింది.

ఇదిలా ఉండగా.. వోగ్స్ మ్యాగజైన్ తొలి భారతీయ నటీమణిగా దర్శనమివ్వనున్న దీపికా పడుకునే, ఫోటో సెషన్ అద్భుతంగా ఉంటుందని, పడుకునే అభిమానులను అబ్బురపరిచేలా ఆమె వోగ్స్ కవర్ పేజీలో కనిపించనుందని వోగ్స్ అధికారిక వర్గాల సమాచారం.