1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. మా ఆయనకు ఛాన్సిస్తే నటిస్తా: ఐష్

మా ఆయనకు ఛాన్సిస్తే నటిస్తా: ఐష్

ఐశ్వర్యారాయ్ అందాల సుందరి అభిషేక్ నిర్మాతలు
వివాహమైన తర్వాత కూడా తన ఇమేజ్‌ను ఏమాత్రం తగ్గకుండా నెట్టుకొస్తున్న అందాల సుందరి ఐశ్వర్యారాయ్ నిర్మాతలకు కొత్తగా షరతులు పెడుతోందట. తాను భవిష్యత్తులో ఏ చిత్రంలోనైనా నటించాలంటే ఆ చిత్రంలో అభిషేక్ మాత్రమే హీరోగా ఉండాలని పట్టుబడుతోందట.

ఐశ్వర్యారాయ్ వింత కోరికలను చూసిన కొందరు నిర్మాతలు ఆమెను మెల్లగా వదిలించుకుంటున్నారట. "ప్రేక్షకులలో ఐష్‌కున్న క్రేజ్ దృష్ట్యా ఆమెను కథానాయికగా ఎంపిక చేస్తున్నాం కానీ, పెళ్లయిన తర్వాత ఆమెకు అవకాశం ఇవ్వడమే గొప్ప. అవకాశం ఇచ్చింది గాక మొగుడికే హీరో పాత్రను కట్టబెట్టాలంటే ఎలా కుదురుతుందీ" అని కొందరు నిర్మాతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట.

అన్నట్లు గతంలో "భర్తగారికి ఛాన్సిస్తే నటిస్తా..." అంటూ షరతులు పెట్టిన "ప్రేమ పావురాలు" భాగ్యశ్రీ వంటివారు ఆ తర్వాత ఇంటికే పరిమితమైన సంగతి ఐష్‌కు తెలుసో లేదో మరి.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT