Jagapathy Babu energy Secreat | హీరోయిన్ల ప్రక్కనే కూర్చుంటే ఎనర్జీ వస్తోందట
సామాన్య మానవుడు నీరసంగా ఉంటే కాస్త కాఫీనో, టీనో తాగితేనో, లేదంటే దమ్ము కొడితే చాలు.. ఎక్కడ లేని హుషార్ వచ్చేస్తుంది. సినిమా ఇండస్ట్రీలో రచయితలకైతే సరైన పాటలు రావాలంటే కాస్త మందు కూడా పడాల్సిందే. సీతారామశాస్త్రి లాంటి వారు అర్థరాత్రుళ్ళు నిద్రమాని ఆకాశం వైపు చూస్తూ.. నిశ్శబ్ధ వాతావరణంలో చక్కటి సాహిత్యం రాస్తారట. ఇలా ఒక్కొక్కరికి ఒక్కో ఎనర్జీ-అలర్జీ ఉంటుంది.
ఇక అసలు విషయానికొస్తే.. జగపతిబాబుకు మాత్రం హీరోయిన్లు పక్కన కూర్చేంటేనే ఎనర్జీ అట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పాడు. "అధినేత" సక్సెస్‌మీట్‌కు వచ్చిన ఆయన్ను పలకరిస్తే.. ఈ ప్రోగ్రామ్‌కు తానే ముందు వచ్చానని, డల్‌గా ఓ మూల కూర్చున్నానన్నారు.
తర్వాత నిర్మాత కోరిక మేరకు నీలిమ, శ్రద్ధాదాస్, హంసానందినిల మధ్యలో కూర్చోవడంతో తనకు ఫుల్ ఎనర్జీ వచ్చిందని జగపతిబాబు నవ్వుతూ చెప్పారు. ఏది ఏమైనా హీరోయిన్స్, హీరోయిన్సే.. వారు లేకపోతే సభకు అందమే ఉండదని ఆయన వెల్లడించారు.
ఇంకా జగపతిబాబు అన్నపూర్ణమ్మనుద్దేశించి మాట్లాడుతూ.. ఆమెతో కలిసి నటించడం ఇంకా ఎనర్జీగా ఉంటుందని, అన్నపూర్ణమ్మ వయస్సు పెరిగే కొద్ది యవ్వనం ఉట్టిపడుతోందని పొగడ్తలతో ముంచెత్తారు.
ఇంకేముంది... దీంతో జగపతిబాబు ఎనర్జీ ఏమిటో తెలిసిపోయింది కదూ...?