1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు

సెల్‌ఫోన్ జామర్ల నడుమ "రోబో" షూటింగ్

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఐశ్వర్యా రాయ్ దర్శకుడు రోబో చిత్రం షూటింగ్ విశేషాలు శంకర్
FileFILE
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్‌, అందాల సుందరి ఐశ్వర్యా రాయ్‌ జంటగా సంచలన దర్శకుడు శంకర్ రూపొందిస్తున్న "రోబో" చిత్రం షూటింగ్ సెల్‌ఫోన్ జామర్ల మధ్య జరుగుతోంది. రజనీకాంత్ సైంటిస్టు పాత్రలో ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రం వివరాలు బయటకు పొక్కకుండా ఉండేందుకు సెల్‌ఫోన్‌ జామర్లు పెట్టి రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్‌ చేస్తున్నారు. అయతే, చిత్ర షూటింగ్ విశేషాలు మాత్రం ఎప్పటికప్పుడు బయటకు పొక్కుతూనే ఉన్నాయి.

ఈ చిత్రంలో ఇప్పటి వరకు ఎవరూ చేయని సాహసాన్ని ఈ చిత్రం ద్వారా దర్శకుడు శంకర్‌ చేస్తున్నట్టు చిత్రం యూనిట్ చెపుతోంది. 2400 సంవత్సరంలో సినిమా కథ ప్రారంభం అవుతుందని తెలిసింది. అక్కడ నుంచి కథ అనేక మలుపులు తిరుగుతూ... భవిష్యత్‌ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్నట్టు సమాచారం.

ఈ చిత్రం కోసం ఒళ్ళు గగుర్పొడిచే విధంగా హీరో హీరోయిన్లతో పాటు 300 మంది ఫైటర్స్‌ పాల్గొన్న థ్రిల్లింగ్ పోరాట సన్నివేశాలను చిత్రీకరించారు. అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందుతున్న ఈ భారీ చిత్రాన్ని అయ్యంగార్‌ ఇంటర్నేషనల్‌ మరియు యూరోస్‌ ఇంటర్నేషనల్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

అలాగే, జురాసిక్‌ పార్క్ చిత్రానికి స్పెషల్‌ ఎఫెక్ట్స్‌ చేసిన స్టాన్‌ విన్‌స్టన్‌ ఈ చిత్రానికి స్పెషల్‌ ఎఫెక్ట్స్‌ చేస్తున్నారు. ది లెజెండ్‌, ది మ్యాట్రిక్స్‌ లాంటి హాలీవుడ్‌ చిత్రాలకు దర్శకత్వం వహించిన చైనీస్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ స్టంట్‌ మాస్టర్‌ ఈన్‌ వూ పింగ్‌ "రోబో" చిత్రానికి స్టంట్స్‌ నిర్వహిస్తుండటం గమనార్హం.
About Writer
PNR