1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు
  6. చేసిందే చేయాలా..? మూడ్ లేదు చూద్దాం!

I dont like to act again scenes: Srihari | చేసిందే చేయాలా..? మూడ్ లేదు చూద్దాం!

వినోదం వెండితెర గుసగుసలు చేసిందే చేయాలా మూడ్ లేదు చూద్దాం శ్రీహరి మగధీర రీ షూట్ అల్లు అర్జున్ అల్లు అరవింద్ రామ్చరణ్
మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ తేజ హీరోగా నటిస్తోన్న "మగధీర" చిత్రం రీషూట్ చేస్తున్నారని ఇండస్ట్రీ టాక్. ఇటీవల రామోజీ ఫిలింసిటీలో షూట్ చేసిన కొన్ని సన్నివేశాలు మిస్సయ్యాయి. అయితే రీషూట్‌కు ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తున్న శ్రీహరి సహకరించలేదని వార్తలు వినిపిస్తున్నాయి.

రియల్ స్టార్ శ్రీహరి తాజాగా ఆర్యరాజేష్‌తోనూ పలు చిత్రాల్లోనూ క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీగా ఉన్నాడు. అయితే ఈ విషయంలో అల్లు అరవింద్ కూడా కలుగజేసుకున్నాడని తెలిసింది.

రాజమౌళి సినిమాలో శ్రీహరి పాత్ర కీలకం. ఇంకా అల్లు అర్జున్ కూడా నటిస్తున్న ఈ చిత్రం రీ షూటింగ్‌కు అల్లు అర్జున్ కూడా శ్రీహరిని ఒప్పించే ప్రయత్నం చేశారట.

దీంతో శ్రీహరి.. చేసిందేచేయడానికి మూడ్ రావాలని, ఎనర్జీ కావాలని చూద్దాం అన్నాడట. అంతేకాదు.. ఇందులో తన తప్పేమీ లేదని శ్రీహరి తేల్చి చెబుతున్నాడట. మరి "మగధీర" ఏం చేస్తాడో వేచి చూడాల్సిందే..!
About Writer
SELVI.M