1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. ప్రియాంకా.. షాహిద్‌ను వదిలిపెట్టు..!

Kareena wants Priyanka out of Shahid's life | ప్రియాంకా.. షాహిద్‌ను వదిలిపెట్టు..!

వినోదం వెండితెర గుసగుసలు ప్రియాంకా చోప్రా షాహిద్ కపూర్ కరీనా కపూర్ ప్రేమ
తన ప్రేమికుడైన షాహిద్ కపూర్ జీవితం నుంచి ప్రియాంక చోప్రా దూరం కావాలని బాలీవుడ్ అందాల రాశి కరీనా కపూర్ అంటోంది. ఈ మధ్య ఫంక్షన్లకు, పార్టీలకు సైఫ్ అలీ ఖాన్‌తో దర్శనమిచ్చే కరీనా కపూర్, షాహిద్‌ను ప్రేమిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో.. ప్రియాంక చోప్రా, షాహిద్‌తో డేటింగ్ జరుపుతోందని, ఇద్దరూ కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారని కరీనాకు తెలిసింది. దీంతో ఫైర్ అయిపోయిన కరీనా షాహిద్‌తో తన సంబంధాన్ని తెగతెంపులు చేసుకుందని బాలీవుడ్ వర్గాల సమాచారం.

అండ్రాజ్, ఐత్రాజ్ సినిమాల్లో నటించిన కరీనా, ప్రియాంకలు నిజజీవితంలో మంచి స్నేహితులని, షాహిద్ విషయంలో వీరిద్దరికి మనస్పర్ధలు తలెత్తాయని సినీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.

షాహిద్‌తో ప్రియాంక ప్రేమాయణం జరుపుతోందన్న విషయం కరీనాను చాలా కుంగదీస్తుందని, దీంతో చోప్రా షాహిద్‌కు సరైన మ్యాచ్ కాదని కరీనా కోపంగా చెప్పిందట. అంతేకాదు.. తన బాయ్‌ఫ్రెండ్‌ను వదిలిపెట్టమ్మా... తల్లీ...! అంటూ కరీనా చోప్రాను వేడుకుంటున్నట్లు సినీ వర్గాల్లో వార్తలు షికార్లు చేస్తున్నాయి.